టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడమే కాదు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఆ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండడం విశేషం. ఇటీవల 'కార్తికేయ 2' తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్ ఇప్పటికే 'స్పై' , 'ద ఇండియన్ హౌజ్' అనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా నిఖిల్ ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈరోజు నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. నిఖిల్ కెరియర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'స్వయంభూ' అనే టైటిల్ని ఖరారు చేశారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పిక్సెల్ స్టూడియోస్ పై భువన్ మరియు శ్రీకర్ పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.


'స్వయంభు' అంటే 'స్వయంభువు' లేదా 'అది తన సొంత ఒప్పందంతో సృష్టించబడింది' అని అర్థం వచ్చేలా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. ఇక ఈ మూవీలో నిఖిల్ క్రూరమైన యోధుడిగా కనిపించబోతున్నాడు. తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్లో నిఖిల్ యోధుడిగా పొడవాటి జుట్టుతో ఒక చేతిలో  ఈటెను, మరొక చేతిలో షీల్డ్ తో గుర్రంపై స్వారీ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్లో నిఖిల్ మేకోవర్, గెటప్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పచ్చు. ఇప్పటివరకు నిఖిల్ ని బహుశా ఇటువంటి మేకోవర్లో ప్రేక్షకులు చూసి ఉండకపోవచ్చు. అంతలా ఈ సినిమాలో నిఖిల్ తన మేకోవర్తో అదరగొట్టేసాడు. ఇక నిఖిల్ కెరియర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇక ఈ 'స్వయంభూ' మూవీ ఒక యువ యోధుడిని వర్ణించే పురాణ ఫాంటసీ కథ అని తెలుస్తోంది.






తాజాగా విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ఒకసారిగా సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. దీంతో ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రానికి కే జి ఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ సంగీతమందిస్తుండగా, మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. విజయ్ కామిశెట్టి, జిటి ఆనంద్ సహ నిర్మాతలగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభం కానుంది. కాగా ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న 'స్పై' మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ మరణ వెనుక ఉన్న రహస్యాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. గ్యారీ బిహెచ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. జూన్ 29న ఈ సినిమా విడుదల కాబోతోంది.