'దేవర'తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR) భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడం మాత్రమే కాదు... అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది. 'దేవర' విజయంతో సంతోషంగా ఉన్న ఎన్టీఆర్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని 'వార్ 2' చిత్రీకరణ చేయడానికి ముంబై వెళ్లనున్నారు. అది కాకుండా ఆయన చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... కొత్త సినిమాకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ వివరాల్లోకి వెళితే...
రజనీకాంత్ దర్శకుడు తో సినిమా చేయనున్న ఎన్టీఆర్!
Nelson Dilipkumar to direct NTR: నెల్సన్ దిలీప్ కుమార్... తెలుగు ప్రేక్షకులలో కొందరికి ఈ పేరు తెలిసే ఉంటుంది. ఒకవేళ ఆయన తెలియకపోయినా ఆయన తీసిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు తప్పకుండా తెలిసే ఉంటాయి. రజనీకాంత్ మాస్ ఇమేజ్, స్టార్ స్టేటస్ వంటివి ఈతరానికి కూడా అర్థం అయ్యేలా తీసిన 'జైలర్' చిత్రానికి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. అతడు చెప్పిన ఓ కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
ఎన్టీఆర్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్న సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేయనున్నారని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. 'దేవర'ను తెలుగు రాష్ట్రాలలో సితార సంస్థ మీద నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎన్టీఆర్, ఆయన మధ్య మంచి అనుబంధం ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలో ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అరవింద సమేత వీర రాఘవ' భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈసారి సితార సంస్థలో ఎన్టీఆర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందించనున్నారు.
Also Read: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ఉన్న సినిమాలు ఏమిటి?
NTR Upcoming Movies: 'దేవర' విడుదలకు ముందు బాలీవుడ్ సినిమా 'వార్ 2' చిత్రీకరణ ప్రారంభించారు ఎన్టీఆర్. అందులో హృతిక్ రోషన్ మరొక హీరో. ఆది ఎన్టీఆర్ ఫస్ట్ స్ట్రయిట్ హిందీ సినిమా. దాని తర్వాత 'కేజిఎఫ్', 'సలార్' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు. ఆ చిత్రానికి 'డ్రాగన్' టైటిల్ ఖరారు చేసినట్లు వినబడుతుంది. అయితే... అధికారికంగా ఆ మాట చెప్పలేదు. నెల్సన్ దిలీప్ కుమార్ విషయానికి వస్తే... సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన తీసిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. 'జైలర్ 2' పూర్తి అయ్యాక ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయనున్నారని సమాచారం. మరోవైపు ఎన్టీఆర్ కూడా 'దేవర 2' చేయాల్సి ఉంది.
Also Read: 'దేవర 2'లో ఆ రెండూ... లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ లీక్ చేసిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్!