NTR In Dadasaheb Phalke Biopic Project: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా మారారు. తాజాగా.. ఆయన లైనప్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందనే న్యూస్ బాలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటివరకూ ఎవరూ చేయని రోల్‌లో ఓ బయోపిక్‌లో ఎన్టీఆర్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాస్

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే (Dadasaheb Phalke) పాత్రలో ఎన్టీఆర్ నటించనున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాదాపు రెండేళ్ల క్రితం దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో 'మేడ్ ఇన్ ఇండియా' (Made In India) అనే బహు భాషా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టును ఆయన తనయుడు కార్తికేయ, వరుణ్ కార్తికేయ సంయుక్తంగా నిర్మించనున్నారు. నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని అప్పట్లో వెల్లడించారు.

మళ్లీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. భారతీయ సినిమా గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా దాదాసాహెబ్ ఫాల్కే మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్‌లో ఎన్టీఆర్ నటించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read: ప్రభుదేవా హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ 'జాలీ ఓ జింఖానా' - తెలుగులో డైరెక్ట్ ఓటీటీలోకి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

ఈ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ మీడియా వెల్లడించింది. 'ఈ స్క్రిప్ట్ విని ఆశ్చర్యపోయారు. ఈ స్టోరీ భారతీయ సినిమా పుట్టుక.. అది ఎదిగిన తీరు ప్రపంచానికి చూపిస్తుంది. ఈ రోల్‌లో యాక్ట్ చేసేందుకు ఎన్టీఆర్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. టీమ్ మొత్తం దీనిపై ఎంతో ఆసక్తిగా ఉంది. సుధీర్ఘ చర్చల తర్వాత ఫైనల్ స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యింది.' అని సినీ వర్గాల టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై న్యూస్ ట్రెండ్ అవుతున్న క్రమంలో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సూపర్ ప్రాజెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బయోపిక్‌లో ఎన్టీఆర్‌ను చూసేందుకు వెయిట్ చేస్తున్నామంటూ పేర్కొంటున్నారు.

దాదాసాహెబ్ ఫాల్కే గురించి..

భారతీయ సినిమా పితామహుడిగా 'దాదాసాహెబ్ ఫాల్కే'ను పిలుస్తారు. 1870లో జన్మించిన ఆయన 1913లో భారతదేశ మొదటి సినిమా 'రాజా హరిశ్చంద్ర'ను తెరకెక్కించారు. అక్కడి నుంచి మొదలైన మన సినీ ప్రయాణం నేడు ప్రపంచ స్థాయికి ఎదిగింది. ఫాల్కే భారతీయ చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి చేశారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏర్పాటు చేసింది. ఈ పురస్కారాన్ని భారతీయ చలన చిత్ర రంగంలో అత్యున్నతమైనదిగా భావిస్తారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో 'డ్రాగన్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. అలాగే, బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'వార్ 2' కూడా త్వరలోనే రానుంది. దేవర సీక్వెల్ 'దేవర 2'లోనూ నటిస్తున్నారు. వీటితో పాటే తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి.