NTR Fan Koushik: ఫ్యాన్స్ హెల్ప్ చేశారు - ఎన్టీఆర్ చేయలేదు - ఇంకో రూ.20 లక్షలు కావాలి - కౌశిక్ తల్లి ఆవేదన!

NTR Fan Koushik Cancer: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ క్యాన్సర్ విషయం కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు ఎన్టీఆర్ తన ఫ్యాన్‌తో వీడియో కాల్ మాట్లాడారు కూడా.

Continues below advertisement

NTR Fan Koushik Mother: క్యాన్సర్‌తో బాధ పడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ తల్లి మీడియాతో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కలిసి రూ.2.5 లక్షలు హెల్ప్ చేశారని, ఎన్టీఆర్ నుంచి తనకు ఎటువంటి సాయం అందలేదని ఆమె తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్‌తో వీడియో కాల్ మాట్లాడించిన కృష్ణా యాదవ్‌ను కాంటాక్ట్ చేయడానికి ప్రయ్నతిస్తే ఆయన సరిగ్గా స్పందించలేదన్నారు.

Continues below advertisement

అసలు ఆమె ఏమన్నారు?
‘జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మాకు ఏమీ ఆర్థిక సాయం రాలేదు. ఆయన ఫ్యాన్స్ దగ్గర నుంచి రూ.2.5 లక్షల సాయం అందింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.11 లక్షలు వచ్చింది. అలాగే టీటీడీ వాళ్లు రూ.40 లక్షలు ఇచ్చారు. అబ్బాయి కండీషన్ ఇప్పుడు బాగుంది. కీమోథెరపీ చేయడం వల్ల హార్ట్, లంగ్స్‌లో అంతా ఇన్ఫెక్షన్ చేరింది. బాబుని డిశ్చార్జ్ చేయడానికి కూడా రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని అంటున్నారు. కృష్ణా యాదవ్ అనే ఆయన మాకు జూనియర్ ఎన్టీఆర్‌తో వీడియో కాల్ చేయించారు. ఏదైనా హెల్ప్ చేయండి అని ఆయన్ని అడిగితే గవర్నమెంట్ దగ్గరికి వెళ్లమని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ అకౌంటెంట్ అని నా దగ్గర ఒక నంబర్ ఉంది. ఆ నంబర్‌కి కాల్ చేస్తే టీటీడీ ఇచ్చింది కదా మమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పారు. ఇంకేం చెప్పలేదు. ఎన్టీఆర్‌కు డైరెక్ట్ కాంటాక్ట్ నా దగ్గర ఏమీ లేదు. నేను ఆయన్ని హెల్ప్ చేయమని చాలా సార్లు అడిగినా లేదని చెప్పారు.’ అని కౌశిక్ తల్లి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Also Read: Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

‘దేవర’ చూసి చనిపోతా అంటూ...
పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో ‘దేవర’ చూసి చనిపోతా అని కౌశిక్ అనడంతో అతని తల్లి దండ్రులు మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్‌తో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కౌశిక్ తల్లి మీడియాతో మాట్లాడటంతో విషయం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. మరి దీనిపై జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఆయన టీమ్ కానీ స్పందిస్తుందేమో చూడాలి.

Also Read: ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 

Continues below advertisement
Sponsored Links by Taboola