Nithya Menen Upcoming Movie: కథ నచ్చి, అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నిత్యా మీనన్.. ఈ సినిమాలో నటిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ తన పాత్రకు ప్రాధాన్యత లేదంటే స్టార్ హీరోల సినిమాలను సైతం తాను రిజెక్ట్ చేస్తుందని సినీ సర్కిల్లో తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకుంది నిత్యా. అందుకే ప్రస్తుతం తను సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించింది. గతేడాది సినిమాలు కాకుండా బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఏప్రిల్ 8న నిత్యా మీనన్ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇందులో నిత్యా కొత్త మేక్ ఓవర్‌లో కనిపించి అందరికీ షాకిచ్చింది.
చేతిలో ఏంటది.?
కామినిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ నిత్యా మీనన్ నటిస్తున్న చిత్రమే ‘డియర్ ఎక్సెస్’. పోస్టర్, అందులో నిత్యా మీనన్ లుక్, టైటిల్ చూస్తుంటే ఇదొక ఫ్యాంటసీ రిలేషన్‌షిప్ డ్రామా అని అర్థమవుతోంది. మామూలుగా నిత్యా ఎక్కువగా పక్కింటమ్మాయి పాత్రల్లో నటించడానికే ఇష్టపడుతుంది. అంతే కాకుండా తన పాత్రల విషయంలో చాలా కచ్చితంగా ఉంటుంది. అలాంటి ఈ భామ.. ఇలాంటి ఒక రిలేషన్‌షిప్ ఫ్యాంటసీ చిత్రాన్ని ఎంచుకోవడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. పైగా ఈ టైటిల్ పోస్టర్‌లో ఒక చేతిలో నిత్యా మీనన్ ఏదో డ్రింక్ పట్టుకొని కనిపిస్తుంది. తన లుక్‌ను బట్టి చూస్తే అది మామూలు డ్రింక్ అని మాత్రం అనిపించడం లేదు. స్క్రీన్‌పై ఎప్పుడూ తాగనని తేల్చిచెప్పిన నిత్యా మీనన్.. ‘డియర్ ఎక్సెస్’ చిత్రం కోసం ఇంతలా మారిపోయిందా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
క్రేజీ కాంబినేషన్..
‘డియర్ ఎక్సెస్’లో నిత్యా మీనన్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్ పాత్రల్లో వినయ్ రాయ్, నవదీప్, ప్రతీక్ బాబర్ కనిపించనున్నారు. మలయాళ నటుడు దీపక్ పరంబోల్ కూడా కీలక పాత్రలో నటించనున్నాడు. కామిని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బీజీఎప్, అజయ్ సింగ్, రామ్కీ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘హనుమాన్’లాంటి చార్ట్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకొని ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు వినయ్ రాయ్. నవదీప్ కూడా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్నాడు. ప్రతీక్ బాబర్ హిందీలో హ్యాండ్‌సమ్ యంగ్ హీరోగా పేరు దక్కించుకున్నాడు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకుల్లో అప్పుడే ఆసక్తి మొదలయ్యింది.
వెబ్ సిరీస్‌లు మాత్రమే..
గతేడాది సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించింది నిత్యా మీనన్. 2023లో ‘కొలంబి’ అనే మలయాళ చిత్రంతో మాత్రమే ప్రేక్షకులను పలకరించింది. కానీ వెబ్ సిరీస్‌లతో మాత్రమే ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంది. ‘మాస్టర్ పీస్’, ‘కుమారి శ్రీమతి’ లాంటి రెండు డిఫరెంట్ జోనర్ వెబ్ సిరీస్‌లలో నిత్యా నటించి మెప్పించింది. ప్రస్తుతం తన చేతిలో ధనుష్ హీరోగా నటిస్తున్న ‘రాయన్’ చిత్రం ఉండగా.. ఇప్పుడు ‘డియర్ ఎక్సెస్’ కూడా యాడ్ అయ్యింది. ఈ రెండు సినిమాలో 2024లోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: అలాగైతే నేను చేయలేను, మెంటల్ నేను - టాలీవుడ్‌పై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్