Sai Pallavi: ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓమ్ రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు మరో రామాయణం ఆధారంగా మరో సినిమా తెరకెక్కబోతోందని బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు నితీష్ తివారీ రామాయణం బ్యాగ్డ్రాప్ లో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారని ఆ వార్తలు సారాంశం. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ కనిపించనుండగా రావణుడి పాత్రలో హృతిక్ రోషన్ చేయనున్నాడు. అంతే కాదు సీత పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి నటిస్తుందని అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన ఏమీ రాలేదు.
సీత పాత్రలో సాయి పల్లవి..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి కూడా ఒకరు. ఆమె అందం అభినయం, విలక్షణమైన నటన డాన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆమె తెలుగులో నటించిన ఫిదా, శామ్ సింగరాయ్, విరాట పర్వం, గార్గి వంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే సాయి పల్లవి ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్టులు ఉన్నట్లు ప్రకటించలేదు కూడా. కానీ గత కొన్ని రోజుల క్రితం సాయి పల్లవి ఒక హాస్పిటల్ నిర్మాణం చేపట్టిందని, అది పూర్తయిన తర్వాత అక్కడే ఉండి పేదలకు సాయం చేస్తానని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కానీ వాటిపై సాయి పల్లవి స్పందిచలేదు. ఆమెకు నచ్చిన పాత్రలు వస్తే చేయడానికి సిద్దంగా ఉందనే వార్తలు కూడా తర్వాత వచ్చాయి. కానీ ఇప్పటి వరకూ ఆమె నుంచి ఎలాంటి సినిమా అనౌన్స్మెంట్ రాలేదు. మరి ఇప్పుడు డైరెక్ట్ గా బాలీవుడ్ లో సీత పాత్ర చేయడానికి ఒప్పుకుంటుందా లేదా అనేది ప్రశ్న. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతానికి పెండింగ్ లో నితీష్ రామాయణం ప్రాజెక్ట్..
బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ రామాయణం బ్యాగ్డ్రాప్ లో చేయాలనుకున్న సినిమాను ప్రస్తుతానికి వాయిదా వేశాడనే వార్తలు బాలీవుడ్ నుంచి వస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుం ఆయన వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ లతో ‘బవాల్’ సినిమాను తీస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఫోకస్ అంతా ఆ సినిమా మీదే పెట్టారట. ఈ సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాత రామయణం సినిమా పై క్లారిటీ వస్తుందని అంటున్నారు. అయితే ఈ మూవీలో రావణుడి పాత్ర కోసం హృతిక్ రోషన్ ను సంప్రదించగా ఆయన ఓకే చెప్పారట. వాస్తవానికి పురాణాల పాత్రలు వేయడం హృతిక్ కు ఇష్టమేనట. అయితే నితీష్ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయట. అయితే నితీష్ ఈ సినిమాను తీస్తారా లేదా తీస్తే ఏ రామాయణంలో ఏ పాయింట్ ను తీసుకుంటారు అని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Read Also : ఆ పార్టీలో మహేష్ భార్య నమ్రత ధరించిన కుర్తా అంత ఖరీదా?