Varun Sandesh New Movie Nindha Teaser Review: వరుణ్ సందేశ్ హీరోగా యాక్ట్ చేసిన కొత్త సినిమా 'నింద'. ఏ కాండ్రకోట మిస్టరీ... అనేది ఉప శీర్షిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాండ్రకోట మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వర్సటైల్ యాక్టర్ & హీరో, దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నవీన్ చంద్ర చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇంతకీ, ఆ టీజర్ ఎలా ఉందో చూడండి. 


తప్పని తెలిసినా చేయక తప్పదు!
'నింద' సినిమాలో సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి కీలక పాత్రలో యాక్ట్ చేశారు. ఆయన చెప్పే 'జీవితంలో కొన్నిసార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు' అనే డైలాగుతో టీజర్ ప్రారంభం అయ్యింది. నిరాశ, నిస్పృహలతో కూడిన స్థితిలో ఆయన్ను చూపించారు. ఆ తర్వాత వరుణ్ సందేశ్ క్యారెక్టర్ ఎంట్రీ! ఓ గదిలో గోడ మీద న్యాయదేవతను పోలిన బొమ్మ, దాని ముందు కుర్చీలో హీరో... తీవ్రంగా ఏదో ఆలోచిస్తున్నట్టు చూపించారు.


బాలరాజు తోటలో ఊరి వ్యక్తి చూసిన శవం ఎవరిది? నటి యానీతో పాటు ఉన్న యువకుడు ఎవరు? మరొక ప్రేమ జంట పరిస్థితి ఏంటి? పోలీస్ స్టేషనుకు వరుణ్ సందేశ్ ఎందుకు వెళ్లారు? అతనితో పాటు బండి మీద ఉన్న అమ్మాయి ఎవరు? హీరో ఎవరెవరినో ఎందుకు కలిశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. టీజర్ చూస్తే క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ బావున్నట్టు అర్థం అవుతోంది. మరి, సినిమా ఎలా ఉంటుందో?


Also Read: చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?



త్వరలో ప్రేక్షకుల ముందుకు 'నింద'!
Nindha Release Date: రాజేష్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో 'నింద' సినిమా తెరకెక్కింది. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ పతాకంపై స్వయంగా ఆయనే ఈ మూవీ ప్రొడ్యూస్ చెయ్యడంతో పాటు కథ, కథనం అందించారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తానని ఆయన తెలిపారు. కాండ్రకోట మిస్టరీ ఆ మధ్య వార్తల్లో నిలిచింది. ఆ ఊరి దెయ్యాలు, ఆత్మలు రాత్రి వేళల్లో తిరుగుతున్నాయని, ప్రజలెవరూ నిద్రపోవడం లేదని కథనాలు వచ్చాయి. ఆ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. దాంతో ప్రజల్లో ఆసక్తి మొదలు అయ్యింది.


Also Read: 'టాక్సిక్'లో హీరోయిన్ ఆ అమ్మాయే - 'కెజియఫ్' యశ్ సరసన హిందీ హీరో వైఫ్!


వరుణ్ సందేశ్ హీరోగా రూపొందిన 'నింద' సినిమాలో 'బేబీ' యానీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, 'ఛత్రపతి' శేఖర్, 'మైమ్' మధు, సిద్దార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ్ కృష్ణ, రాజ్ కుమార్ కుర్రా, దుర్గా అభిషేక్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: అనిల్ కుమార్, కెమెరా: రమీజ్ నవీత్, సంగీత దర్శకత్వం: సంతు ఓంకార్, నిర్మాణ సంస్థ: ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్, రచన-నిర్మాణం-దర్శకత్వం: రాజేష్ జగన్నాథం.