Nidhhi Agerwal Reaction On Sivaji Comments : హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ హీరో శివాజీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన వేళ ఆయన క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంలో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఇటీవల లులు మాల్‌లో జరిగిన చేదు అనుభవాన్ని ప్రస్తావించారు. దీనిపై హీరోయిన్ నిధి ఇండైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యారు.

Continues below advertisement

బాధితురాలిని నిందించడం...

'బాధితురాలిని నిందిస్తూ సానుభూతి పొందడం సరికాదు' అంటూ తన ఇన్ స్టా స్టోరీలో నిధి రాసుకొచ్చారు. శివాజీ అపాలజీ చెబుతూ తన వివరణలో నిధి అగర్వాల్ పడ్డ ఇబ్బందిని ప్రస్తావించారు. 'లులు మాల్‌లో నిది అగర్వాల్‌‌కు ఏదైనా జరగరానిది జరిగితే ఆ అమ్మాయి జీవిత కాలం ఆ వీడియోలు ఉంటాయి కదా. తీయమన్నా ఎవరైనా తీస్తారా?. ఆ ఒక్క సిట్యువేషన్ నాకు చాలా బాధ కలిగించింది. జనాల్లోకి వెళ్లినప్పుడు నిండుగా చీర కట్టుకోవాలనే చెప్పా.' అని అన్నారు.

Continues below advertisement

దీంతో నిధి అగర్వాల్ పోస్ట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమె ఇండైరెక్ట్‌గా శివాజీని ఉద్దేశించే ఆ పోస్ట్ చేశారా? అంటూ నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు.

శివాజీ ఏం చెప్పారంటే?

లులు మాల్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఎదురైన చేదు అనుభవం నా మైండ్‌లో నుంచి పోలేదని... ఆ తర్వాత సమంత గారిని కూడా వేధించారని చెప్పారు శివాజీ. 'ఒకప్పుడు రమ్యకృష్ణ గారు, జయసుధ గారు, విజయశాంతి గారు కట్టుకున్న చీరలు వాళ్ల పేరుతోనే విక్రయాలు జరిగేవి. సమాజంలో ఏ రుగ్మత వచ్చినా సినిమాల వల్లే చెడిపోతున్నారని అంటారు. సినిమా వల్లే ప్రపంచ నాశనమవుతోందనే మాటలు వింటూ విన్నాం. సినిమా ద్వారానే నా కుటుంబం బతుకుతోంది. నా సినిమాను ఎవరూ అలా అనకూడదనే ఉద్దేశంతోనే అలా మాట్లాడాల్సి వచ్చింది.' అని అన్నారు.

Also Read : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్