Nidhhi Agerwal Cute Reply To Fan On Marriage Proposal: సోషల్ మీడియా వేదికగా చాలా మంది హీరోయిన్లు యాక్టివ్‌గా ఉంటూ తమకు టైం దొరికినప్పుడు తమ అభిమానులతో చిట్ చాట్ నిర్వహిస్తుంటారు. సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా తమకు నచ్చిన వాటి గురించి కూడా తెలుసుకుంటుంటారు.
'హరిహర వీరమల్లు' హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ నిర్వహించారు. ఓ అభిమాని నుంచి ఆమెకు ఓ ప్రశ్న ఎదురు కాగా... ఆమె క్యూట్‌గా రిప్లై ఇచ్చారు. దీంతో పాటే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు నిధి ఆన్సర్ ఇచ్చారు.
ప్లీజ్... నెంబర్ ఇవ్వొచ్చుగా...
ఓ అభిమాని నిధి అగర్వాల్‌కు డైరెక్ట్‌గా పెళ్లి ప్రపోజ్ చేయగా... ఆమె తెలివిగా సమాధానం చెప్పారు. 'మీ అమ్మగారి ఫోన్ నెంబర్ ఇవ్వండి. మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతా... ప్లీజ్ ఇవ్వొచ్చుగా నిధి.' అంటూ హార్ట్ ఎమోజీతో రిక్వెస్ట్ చేశాడు. దీనికి నిధి... 'అవునా?... చిలిపి' అంటూ ఆన్సర్ ఇచ్చారు.
ఆ సీన్స్ సూపర్
'హరిహర వీరమల్లు' లో ఏ సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయని అడిగిన ప్రశ్నకు... 'ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్, క్లైమాక్స్ కోసం ఎదురుచూడండి. నేను చెప్పానని ఎవరికీ చెప్పొద్దు.' అని అన్నారు. ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ చేశానని... లైఫ్‌లో ఇలాంటి ఛాన్స్ అరుదుగా వస్తుందని అన్నారు నిధి. మూవీలో హార్స్ రైడింగ్, డ్యాన్స్ సరదాగా సాగాయన్నారు. ఈ సినిమా తన బిడ్డలాంటిదని... టీం, అభిమానులపై ప్రేమ ప్రత్యేకమైందన్నారు. ఇది దేవుడిచ్చిన బహుమానమని అన్నారు.
ప్రభాస్ రాజాసాబ్‌లో రొమాంటిక్ సాంగ్
ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీలో తనది రొమాంటిక్ సాంగ్ ఉందని నిధి అగర్వాల్ తెలిపారు. యాక్టింగ్ చాలా కష్టమైన రంగమని... మనల్ని మనం నమ్ముకుంటే అనుకున్నది సాధించొచ్చని చెప్పారు.
ఈ నెల 24న రిలీజ్
ఈ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజ్ కాగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. భారీ బడ్జెట్‌తో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో ఎ.దయాకరరావు నిర్మించారు. పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో పవన్ పవర్ ఫుల్ యోధుడిగా కనిపించనున్నారు. ఆయన సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు ఔరంగజేబు రోల్‌లో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, నోరా ఫతేహి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 24న పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.
మరోవైపు... ఈ మూవీలో చరిత్రను వక్రీకరించారంటూ తెలంగాణ బీసీ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని మూవీ రిలీజ్ అడ్డుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చాయి. దీనిపై మూవీ టీం స్పందించాల్సి ఉంది.