Trolls on Salman Khan After Tweet on Laapataa Ladies: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి ట్రోలర్స్ చేతికి చిక్కాడు. ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు 'లాపతా లేడిస్' మార్చి 1న విడుదలైన మంచి విజయం సాధిందింది. ఇక ఈ సినిమా చూసిన సల్మాన్ మూవీ టీం, డైరెక్టర్ కిరణ్ రావును ప్రశంసిస్తూ తన ఎక్స్ పోస్ట్‌లో చేశాడు. అయితే ఇందులో సల్మాన్ తప్పులో కాలేసాడు. దీంతో అది పట్టేసిన నెటిజన్లు ఈ బాలీవుడ్ భాయిజాన్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో తన తప్పు తెలుసుకున్న సల్మాన్ ఆ వెంటనే తన పోస్ట్ రీఎడిట్ చేసి మళ్లీ పోస్ట్ చేశాడు. ఇంతకి ఏం జరిగిందంటే.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో ఇటీవల 'లాపతా లేడీస్' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మార్చి 1న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీసు డీసెంట్ వసూళ్ల సాధిస్తుంది. అంతేకాదు ఈ సినిమాపై పలువురు సెలబ్రీటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న లాపతా లేడీస్ మూవీపై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా స్పందించారు. నిన్న బుధవారం తన తండ్రితో కలిసి సల్మాన్ 'లాపతా లేడీస్' వీక్షించారట.
ట్వీట్ డిలీట్ చేసి.. మళ్లీ
ఇక ఈ సినిమా చూసిన అనంతరం సల్మాన్ మూవీ గురించి పోస్ట్ చేశాడు. ఆయన ట్వీట్ చేస్తూ.. "వాహ్ వాహ్ కిరణ్ రావు. ఇప్పుడే మీ 'లాపతా లేడీస్' సినిమాని నా తండ్రితో కలిసి చూశాను. మూవీ చూసి చాలా ఎంజాయ్ చేశాను. నా తండ్రి కూడా. తొలి దర్శకత్వంలోనే అద్భుతంగా మూవీని తెరక్కించిన కిరణ్ రావుకు నా శుభాకాంక్షలు. గ్రేట్ జాబ్. మరి నాతో కలిసి ఎప్పుడు వర్క్ చేస్తారు?" అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. అయితే ఇది చూసిన నెటిజన్లు వెంటనే సల్మాన్ తప్పిదాన్ని పట్టేశారు. సల్మాన్ జీ.. ఇది కిరణ్ రావు తెరకెక్కించిన తొలి చిత్రం కాదు. ఇప్పటికే ఆమె ఓ సినిమాకు దర్శకత్వం వహించారు. పదేళ్ల కిందట 'ధోబీఘాట్' అనే సినిమాకు దర్శకత్వం వహించారు.
మరోక విషయం ఏంటంటే 'లాపతా లేడీస్' మూవీ ప్రీమియర్స్‌కి కూడా మీరు హాజరయ్యారు. మూవీ ప్రీమియర్‌లో ఆమిర్ ఖాన్‌తో కలిసి ఫోటోలకు కూడా ఫోజులు ఇచ్చారు" అని నెటిజన్లు సల్మాన్ దారుణంగా ట్రోల్ చేశారు. అంతేకాదు ఇప్పటికే లాపతా లేడీస్ ప్రీమియర్స్ చూసిన సల్మాన్.. కొత్త సినిమా చూశానంటూ ట్వీట్ చేయడంపై కూడా ట్రోల్ చేశారు. దీని అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇక ట్రోల్స్ చూసిన సల్మాన్ కొన్ని గంటల్లోనే తన తప్పును కరెక్ట్ చేశారు. తన ట్వీట్ రీఎడిట్ చేసి కిరణ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. కిరణ్ రావు డెబ్యూ పదాన్ని తీసేసి గ్రేట్ జాబ్ అంటూ మరోసారి ట్వీట్ వదిలారు. కాగా ప్రస్తుతం సల్మాన్ ట్వీట్ వైరల్‌గా మారింది.