వరుస విజయాలతో గాడ్ ఆఫ్ ది మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) దూసుకు వెళుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన 'అఖండ 2 తాండవం' డిసెంబర్ 5న పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఆ సినిమా విడుదలకు ముందు కొత్త సినిమా స్టార్ట్ చేశారు బాలయ్య. తనతో 'వీర సింహా రెడ్డి' వంటి సంచలన విజయం తీసిన దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni)కి మరో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఈ రోజు పూజతో మొదలైంది.
బాలకృష్ణ డ్యూయల్ రోల్!గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేయబోయే తాజా సినిమా ఆయనకు 111వ సినిమా. అందుకని, #NBK111 అని వ్యవహరిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది' తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది.
నవంబర్ 26వ తేదీన ఎన్‌బీకే సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ రోజు ముహూర్తం అని పేర్కొంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే... బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు అర్థం అవుతోంది. 'వీర సింహా రెడ్డి'లోనూ బాలయ్యను రెండు గెటప్పుల్లో చూపించారు గోపీచంద్ మలినేని. మరోసారి ఇప్పుడు చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలోనూ బాలయ్య చేత డ్యూయల్ రోల్ చేయిస్తున్నారు. ఆ పోస్టర్ చూస్తుంటే బాలయ్యతో బాలయ్యకే పోటీ అన్నట్టుంది.
Also Read: 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్... డేట్, టైమ్, గ్రౌండ్ డీటెయిల్స్ తెలుసా?
బాలకృష్ణకు జంటగా నయన్!NBK111 Heroine: ఎన్‌బీకే111 సినిమాలో బాలకృష్ణకు జంటగా నయనతార యాక్ట్ చేయనున్నారు. 'సింహ', 'జై సింహా', 'శ్రీ రామరాజ్యం'... మూడు విజయాల తర్వాత వాళ్ళిద్దరి కలయికలో నాలుగో చిత్రమిది.
Also Read: 'ఆంధ్ర కింగ్ తాలూకా' సెన్సార్ రివ్యూ: రామ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్... సినిమాలో హైలైట్స్ ఏమిటంటే?
గోపీచంద్ మలినేని తొలిసారిగా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేస్తున్నారు. ఇంతకు ముందు కమర్షియల్ సినిమాలు తీసి విజయాలు అందుకున్న ఆయన ఈసారి ఎటువంటి సినిమా చేస్తారో చూడాలి. ఇతర వివరాలు త్వరలో అనౌన్స్ చేయనున్నారు.