Akhanda 2 Thaandavam pre release event details: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన తాజా సినిమా 'అఖండ 2 తాండవం'. డిసెంబర్ 5న థియేటర్లలోకి వస్తుందీ సినిమా. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేశారు.

Continues below advertisement


హైదరాబాద్ సిటీలో 'అఖండ 2' ఈవెంట్!
Akhanda 2 Pre Release Event Date: నవంబర్ 28న... అంటే ఈ శుక్రవారం నాడు 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి హైదరాబాద్ సిటీలో కైతలాపూర్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో ఫంక్షన్ చేయనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను సైతం ఆ ప్రాంగణంలో నిర్వహించారు. నందమూరి కుటుంబానికి అది లక్కీ గ్రౌండ్ అని చెప్పాలి. 


'అఖండ 2 తాండవం' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరిని పిలిచారు? అనేది వెల్లడించలేదు. బాలయ్య ఉండగా మరొక గెస్ట్ అవసరం లేదు. అయితే సనాతన ధర్మం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడం వల్ల ఆధ్యాత్మిక గురువులను ఆహ్వానించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read250 కోట్ల డ్రగ్స్ కేసు... పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోదరుడు






అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్‌కు చిన్న నిరాశ!
'అఖండ 2'ను టుడీతో పాటు త్రీడీలోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. కానీ మొదటి రోజు అమెరికాలోని నందమూరి, బాలకృష్ణ అభిమానులకు త్రీడీ సినిమా చూసే అవకాశం లేదు. ప్రీమియర్ షోలు త్రీడీలో వేయడం లేదని 'అఖండ 2' అమెరికా డిస్ట్రిబ్యూటర్ స్పష్టం చేశారు. ఒక రోజు తర్వాత అమెరికాలో 'అఖండ 2'ను త్రీడీలో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు.


Also Read'ఆంధ్ర కింగ్ తాలూకా' సెన్సార్ రివ్యూ: రామ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్... సినిమాలో హైలైట్స్ ఏమిటంటే?


బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'అఖండ 2'లో సంయుక్త హీరోయిన్. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేశారు.