Nayanthara's Special Poster In Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో అవెయిటెడ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు'. ఈ మూవీలో చిరు సరసన స్టార్ హీరోయిన్ నయనతార చేస్తుండగా... తాజాగా మూవీలో ఆమె క్యారెక్టర్ రివీల్ చేస్తూ డైరెక్టర్ అనిల్ సర్ ప్రైజ్ ఇచ్చారు.
చిరుతో 'శశిరేఖ'
ఈ మూవీలో నయనతార (Nayanthara) 'శశిరేఖ' (SASIREKHA) పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. 'మూవీలో నయనతార గారిని శశిరేఖగా పరిచయం చేస్తున్నాం. అందమైన పాత్రలో ఆమె ఉండడం, ఆమెతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అద్భుతమైన సర్ ప్రైజ్‌కు సిద్ధంగా ఉండండి. షూటింగ్ శరవేగంగా సాగుతోంది.' అంటూ రాసుకొచ్చారు.
రీసెంట్‌గా కేరళలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగా... ప్రస్తుతం హైదరాబాద్‌లో సాంగ్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఓ స్పెషల్ సెట్ వేశారు. ఇప్పటికే పలు యాక్షన్ సీన్స్, పాటలు చిత్రీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక దసరాకు బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు టీం అనౌన్స్ చేయగా... అది ఏంటా? అని అందరిలోనూ ఇంట్రెస్ట్ నెలకొంది. మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తుండగా... ఈ నెల 5 నుంచి ఆయన షూటింగ్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన టైటిల్‌ను తన వాయిస్‌తో అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ ఫస్టాఫ్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
వింటేజ్ లుక్ మెగాస్టార్
ఇక రీసెంట్‌గా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ కూడా అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత మెగాస్టార్‌ను వింటేజ్ లుక్‌లో చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. టైట్ సెక్యూరిటీ మధ్య స్టైలిష్ లుక్‌లో చిరంజీవి దిగగా ఆయన రోల్ ఏమై ఉంటుందా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. చిరు స్పై అధికారిగా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తుండగా... డ్రిల్ మాస్టర్‌గానూ కనిపిస్తారనే రూమర్స్ వస్తున్నాయి. ఈ మూవీ భారీ సక్సెస్ సాధించి రికార్డులు తిరగరాయడం ఖాయమంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
చిరు, నయనతారలతో పాటు కేథరిన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.