కోలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నయనతార (Nayanthara), విగ్నేష్ శివన్ (Vignesh Shivan)లు అంగరంగ వైభవంగా ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి అతి తక్కువ మంది సినీ ప్రముఖులు హాజరు కాగా... సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు మాత్రమే రిలీజ్ చేశారు. అయితే అప్పటినుంచి నయనతార పెళ్లి వీడియో గురించి అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ పెళ్లి డాక్యుమెంటరీ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే నయనతార, విగ్నేష్ శివన్ (Nayanthara and Vignesh Shivan Wedding)ల పెళ్లి డాక్యుమెంటరీ రన్ టైం రివీల్ అయింది.
దీపావళి కానుకగా నయనతార పెళ్లి సినిమా
లవ్ బర్డ్స్ నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్ చాలా కాలం డేటింగ్ చేశాక పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2015లో 'నాను రౌడీ ధాన్' అనే సినిమా సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈ జంట ఒకరినొకరు కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమకి దారి తీసింది. ఇక 2021లో అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేటుగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అప్పట్లో టీవీ షో ద్వారా నయనతార తనకు ఎంగేజ్మెంట్ అయ్యిందన్న విషయాన్ని వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక 2022లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోగా ఈ జంట 2022 అక్టోబర్ లో సరోగసి ద్వారా ఇద్దరు మగ పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ఈ నేపథ్యంలోనే గత రెండేళ్ల నుంచి నయనతార, విగ్నేష్ శివన్ ల పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు.
ఇప్పటిదాకా పలు కారణాల వల్ల పెండింగ్ లో ఉన్న ఈ డాక్యుమెంటరీ ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. దీపావళి కానుకగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రన్ టైం విషయానికి వస్తే 1 గంట 21 నిమిషాల పాటు ఉంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. అయితే నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే అప్ కమింగ్ డాక్యుమెంటరీల లిస్టులో నయనతార పెళ్లి డాక్యుమెంటరీని కూడా యాడ్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.
డాక్యుమెంటరీలో ఆ వివాదం కూడా?
నయనతార సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి కావడం అనేది అప్పట్లో వివాదాన్ని రేకెత్తించింది. నయనతార, విగ్నేష్ శివన్ 2022 జూన్ లో పెళ్లి చేసుకోగా, పెళ్లయిన నాలుగు నెలలకే కవలలకు తల్లిదండ్రులైనట్టు ప్రకటించడం అందరికీ షాక్ ఇచ్చింది. వీరిద్దరూ సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు అన్న విషయం అప్పట్లో దుమారం రేపింది. ఎందుకంటే భారతదేశంలో అద్దె గర్భం ద్వారా పిల్లలకు తల్లిదండ్రులు జన్మనివ్వడం అనేది చట్టరీత్యా నేరం. దీంతో తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులను ఈ విషయమై వివరణ కోరింది. పైగా ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇక ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో నయనతార, విగ్నేష్ శివన్ చట్టబద్ధంగానే సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చినట్టుగా తేలింది. వీరిద్దరికి 2016 లోనే పెళ్లయిందని, ఐదేళ్ల తర్వాత 2021లో ఈ దంపతులు ఐసిఎంఆర్ నిబంధనలను అనుసరించి సరోగసి అగ్రిమెంట్ ను పూర్తి చేసినట్టుగా తెలపడంతో ఆ వివాదం సద్దుమణిగింది.
Read Also: ‘వేట్టయన్’ స్టోరీలో వేలు పెట్టిన సూపర్ స్టార్ - పట్టుబట్టి మరీ మార్పులు చేయించిన రజనీకాంత్