Eleven Telugu Teaser: ఈ మధ్య హీరో నవీన్‌ చంద్ర వైవిధ్యమైన కథలు, పాత్రలతో ఫ్యాన్స్‌ని అలరిస్తున్నాడు. ఇటీవల 'ఇన్‌స్పెక్టర్‌ రిషి' అంటూ ఓ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ప్రియులను పలకరించాడు. రీసెంట్‌గా కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో వచ్చిన 'సత్యాభామ' చిత్రంలో కీ రోల్‌ పోషించాడు. అలాగే ఆయన ప్రధాన పాత్రలో బైలింగువల్‌ మూవీగా 'ఎలెవెన్‌' రాబోతుంది. క్రైం మిస్టరి థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది.


ఈ నేపథ్యంలో తాజాగా 'ఎలెవెన్‌' నుంచి మేకర్స్‌ టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఓ కేసు విషయమై హీరో ఇన్వెస్ట్‌గేట్‌ చేస్తూ సాగిన ఈ టీజర్‌ ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. "రంజిత్ లాంటి ప్రతిభ ఉన్న పోలీసు ఆఫీసరే ఈ కేసును ఎందుకు ఛేదించలేకపోయారో ఇప్పుడు అర్థమవుతుంది.. ఫింగర్‌ ప్రింట్స్‌ లేవు, సీసీటీవీ ఫుటేజ్‌ లేదు.. కనీసం జుట్టు ఆనవాళ్లు కూడా లేవు" అని నవీన్‌ చంద్ర చెప్పే డైలాగ్‌తో టీజర్‌ మొదలవుతుంది. ఇందులో పోలీసు ఆఫీసర్‌ ఓ కేసును సీరియస్‌గా తీసుకుని ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నట్టుగా కనిపించారు. అసలు ఎలాంటి ఆధారాలు లేని ఓ కేసును ఛేదించడమే ఎలెవెన్ మూవీ కథ అని టీజర్‌ చూస్తుంటే అర్థమైపోతుంది.



ఇక టీజర్‌ మధ్యలో 'ఎలుకను తిన్న పాముకు తెలియదు.. దాన్ని తినడానికి గద్ద ఒకటి వస్తుంది' అనే నవీన్‌ చంద్ర చెప్పే డైలాగ్‌ ఆసక్తిగా ఉంది. ఈ డైలాగ్‌ నిందితులను ఉద్దేశించిన చెప్పినట్టుగా ఉంది. ఆధారాలు లేని ఓ క్రైం ఇన్వెస్టిగేషన్ చూట్టూ సాగిన టీజర్ ప్రతి క్షణంగా ఉత్కంఠ పెంచింది. ఇక మధ్య మధ్య యాక్షన్‌ సీక్వెన్స్‌ ఆకట్టుకున్నాయి. దాదాపు 1:43 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ సస్పెన్స్‌, థ్రిల్లర్‌గా సాగింది. ఇందులో పోలీసు ఆఫీసర్‌గా నవీన్‌ చంద్ర‌ మరోసారి తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. కాగా తమిళ డైరెక్టర్‌ లోకేష్‌ అజ్లిస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రేయా హరి, శశాంక్‌ అభిరామి, దిలీపన్‌ వంటి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 






Also Read: జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు - షాక్‌ అవుతున్న ఫ్యాన్స్‌