Navadeep Comments on Pawan Kalyan Victory: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించారు. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీలో గెలిచారు. పవన్ కళ్యాన్ గ్రాండ్ విక్టరిపై సినీ పరిశ్రమ మొత్తం ఆనందం వ్యక్తం చేస్తుంది. ఆయన విజయం సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ పవన్ కళ్యాణ్ పోరాట పటిమను కొనియాడుతున్నారు. పవన్ గెలుపుతో సినీ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయంటూ ప్రముఖులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై తాజాగా హీరో నవదీప్‌కు ప్రశ్న ఎదురైంది.
అతడు నటించిన లేటెస్ట్ మూవీ 'లవ్ మౌళి' ప్రమోషన్స్ సందర్భంగా నవదీప్‌ను పవన్ కళ్యాణ్ గెలుపుపై స్పందించాల్సిందిగా ఓ విలేకరి కోరారు. ఈ మేరకు నవదీప్ మాట్లాడుతూ.. "ఇండస్ట్రీ అనుకుంటుంది వంద శాతం నిజం. ఇండస్ట్రీ నుంచి పవర్పుల్ సూపర్ స్టార్ గెలవడం.. అదీ కూడా ఇండియా చరిత్రలో లేని విధంగా వంద శాతం సక్సెస్‌ని కొట్టడమంటే చిన్న విషయం కాదు. పైగా ఆ వ్యక్తి మనకు ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. ఆయన ఇవన్ని పక్కన పెట్టి కేవలం సినిమాలు చేసుకుంటు ఇంట్లోనే ఉంటే ఎలా ఎంజాయ్ చేసేవారో అందరికి తెలుసు. కానీ అవన్ని పక్కన పెట్టి రాష్ట్రం, రాష్ట్ర ప్రజల బాగు కోసం సంవత్సరాలుగా పోరాటం చేశారు. ఆయన పడ్డ కష్టానికి ప్రతి ఫలమే ఈ విక్టరి. అవును ఆయన ప్రజలకు, ఇండస్ట్రీకే కాదు విలైనంత వరకు ఆయన మంచే చేస్తారు.
ఇది అందరికి తెలుసు. ఎందుకంట ఇన్నేళ్లుగా ఎంత కష్టమైనా వెనకడుగు వేయకుండ పోరాటం చేశారంటే ఆయనలో ఎంత కసి ఉందో అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఆయన అందరికి మంచి చేస్తారు. ఇన్నేళ్ల కష్టానికి ఈ ఫలితాలు ఆయన గ్రేట్ విక్టరి. అలాంటి రిజల్ట్ రావడమనేది సాధారణ విషయం కాదు. ఆయన విజయంపై కామన్ మ్యాన్‌గా చాలా సంతోషంగా ఉంది. ఇక ఇండస్ట్రీ వ్యక్తిగా ఆయన సాలిడ్ విక్టరిపై ఫుల్ ఎగ్జయిటింగ్ ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం కల్కి మూవీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకాలం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, ఆడియన్స్‌కి కల్కి టైం వచ్చేసిందంటూ అందరిలో జోష్ నింపాడు. ఈ రోజు ఇక కల్కికి సంబంధించిన వన్ మ్యాన్ షో అని ఏదో వస్తుంది. ఆల్రెడీ వచ్చేసిందా? అయితే టైం స్టార్ట్. అయ్యింది. అంతే ఖతం" అంటూ నవదీప్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
లాంగ్ గ్యాప్ తర్వాత హీరో..
కాగా చాలా గ్యాప్ తర్వాత నవదీప్ హీరో నటించిన 'లవ్ మౌళి' జూన్ 7న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో నవదీప్ ఇదివరకు ఎప్పుడు చేయని జానర్‌ని టచ్ చేశాడు. ఇందులో నవదీప్ లుక్ అందరిలో ఆసక్తిని పెంచింది. లవ్‌డ్రామాగా బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. మౌళి (నవదీప్) ఒక పెయింటర్. చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు విడిపోవడం, ఇద్దరు తమకు కొడుకు వద్దనడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. అలా సమాజానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా పెరిగిన మౌళి తనకు నచ్చినట్టు జీవిస్తాడు. ఎటువంటి బంధాలను కోరుకోడు. స్వతహాగా పెయింటర్ కావడంతో చిత్ర (పంఖురి గిద్వానీ) బొమ్మ గీస్తాడు. ఆమె జీవం పోసుకుని మౌళి ముందుకు వస్తుంది. ఇక ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడుతుంది. ఈక్రమంతో శారీరకంగానూ ఒక్కటవుతున్నారు. అయితే కొన్ని రోజులకు మౌళి చిత్రను కాదని, మరో బొమ్మను గీస్తాడు. అలా ఎందుకు చేశాడు.. ఆ బొమ్మ స్థానంలో వచ్చిందేవరు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.