Nagarjuna - Amala Marriage Anniversary: టాలీవుడ్‌లోని ఎవర్‌గ్రీన్ కపుల్స్‌లో నాగార్జున, అమల కూడా ఒకరు. 1992లో అమల, నాగార్జునకు పెళ్లి జరిగింది. వీరి పెళ్లిరోజు సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్‌తో వీరిద్దరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ అంతా కూడా వీరికి విషెస్ చెప్పడం మొదలుపెట్టారు. అంతే కాకుండా వీరి ప్రేమకథను గుర్తుచేసుకుంటున్నారు. అసలు నాగార్జున, అమల పరిచయం ఎలా జరిగిందో మాట్లాడుకుంటున్నారు.


ఏడ్చేసిన అమల..


మొదటి భార్య లక్ష్మితో నాగార్జున విడాకుల తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయారు. అదే సమయంలో అమల ముఖర్జీతో నాగార్జున కెమిస్ట్రీ బాగుంది అని టాక్ వచ్చేసరికి ఆమెతోనే వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడే అమల అంటే నాగార్జునకు ఇష్టం మొదలయ్యింది. ముందుగా ఆయనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఒకరోజు సెట్‌లో నాగార్జున చేసిన పనితో అమలకు కూడా ఆయనపై ఇష్టం ఏర్పడిందట. ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్‌లోకి రాకుండా క్యారవాన్‌లోనే కూర్చున్నారట అమల. ఏమైందో కనుక్కుందామని వెళ్లి చూస్తే అమల ఏడుస్తూ ఉన్నారట. ఏమైంది అని అడగగా ఒక సీన్‌లో తన బట్టలు అంత సౌకర్యంగా లేవని చెప్పారట. దీంతో నాగార్జున స్వయంగా డైరెక్టర్ దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్తానని మాటిచ్చారట. దీంతో నాగార్జున మంచితనం చూసి ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారట.


అంతా నీ ఇష్టం..


ఫ్రెండ్స్ నుండి లవర్స్‌గా మారడానికి నాగార్జున, అమలకు పెద్దగా సమయం పట్టలేదు. ఎక్కువ సినిమాల్లో కలిసి నటించడం వల్ల వారిద్దరూ మరింత దగ్గరయ్యారు. దీంతో ఒకరోజు అమలకు ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నారు నాగ్. వారిద్దరూ కలిసి అమెరికాకు ట్రిప్‌కు వెళ్లినప్పుడు అక్కడే ఆయన మనసులోని మాటలను అమలతో చెప్పారు. ఆ ప్రపోజల్ గురించి అమల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ‘‘సినిమాల్లో లాగానే మా ప్రేమ, పెళ్లి అంతా అనుకోకుండా జరిగిపోయింది. ఆయన నాకు అనుకోకుండా ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకోమని అడిగారు. అంత ఎగ్జైట్మెంట్‌లో కూడా మనం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతామా అని అడిగాను. అవును అన్నారు. నేను వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని అడిగాను. నువ్వు చేయాలనుకుంటే చేయొచ్చు. నీకు నచ్చింది చేయొచ్చు అన్నారు’’ అని తెలిపారు అమల.


టబుతో రూమర్స్..


అమెరికాలో అంత గ్రాండ్‌గా ప్రపోజ్ చేసిన తర్వాత నాగార్జున, అమల పెళ్లి మాత్రం చాలా సింపుల్‌గా జరిగిపోయింది. 1992 జూన్‌లో చెన్నైలో వీరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ తమ కెరీర్‌లో ఓ రేంజ్ సక్సెస్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత అఖిల్‌కు జన్మనిచ్చారు. అందరిలాగానే వీరి మ్యారేజ్ లైఫ్‌లో కూడా పలు సమస్యలు వచ్చాయి. అమలకు పెట్స్ అంటే చాలా ఇష్టం. అలా ఒకసారి అమలకు తెలియకుండా తనకు ఇష్టమైన పెట్‌ను ట్రైనింగ్‌కు పంపించేశారని నాగ్‌తో 10 రోజులు మాట్లాడలేదట. నాగార్జునకు టబుతో అఫైర్ ఉందని గట్టిగా రూమర్స్ వినిపించాయి. కానీ అవన్నీ తాను పట్టించుకోనని అమల స్టేట్‌మెంట్ ఇచ్చారు. తన ఇల్లు తనకు గుడితో సమానమని, సినీ పరిశ్రమలో వచ్చే రూమర్స్‌ను ఇంట్లోకి రానివ్వనని తెలిపారు.






Also Read: వితికా అందుకే నిద్ర మాత్రలు మింగింది - నేను అప్పుడు అమెరికాలో ఉన్నా: వరుణ్ సందేశ్