National Crush Rashmika Post Viral: టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందం, నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుని నేషనల్ క్రష్‌గా మారింది రష్మిక మంథన్న (Rashmika Mandanna). ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అందాల తార.. తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. అందరిపైనా దయతో ఉండాలంటూ ఆమె ఇన్ స్టా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'ఈ రోజుల్లో అందరిలోనూ దయ తగ్గిపోతోంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా అలానే ఉండండి. ఒకరిపై ఒకరు దయతో ఉండండి.' అని పేర్కొంది. అలాగే, రష్మిక ధరించిన టీ షర్టు మీద సైతం దయ అనే రాసి ఉంది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. ఇటీవలే రష్మిక, లైగర్ బాయ్ విజయ్ దేవరకొండ ఇద్దరూ కలిసి జిమ్‌లో కలిసి కనిపించిన వీడియో నెట్టింట తెగ వైరలైంది. జిమ్‌లో నుంచి బయటకు వచ్చిన విజయ్ కారులో కూర్చోగా.. రష్మిక కాలికి గాయంతో ఇబ్బంది పడుతూ కారులో ఎక్కుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే, మీరూ రష్మికకు సహాయం చెయ్యొచ్చు కదా అంటూ విజయ్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో రష్మిక తాజా పోస్ట్ వైరల్‌గా మారింది.
ఫిబ్రవరి 14న ఆ సినిమా..
మరోవైపు, గతేడాది పుష్ప 2 మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రలో నటింటి మెప్పించారు రష్మిక. ప్రస్తుతం ఆమె నటించిన 'ఛావా' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. విక్కీ కౌశల్ శంభాజీ మహరాజ్‌గా, ఆయన భార్య పాత్రలో రష్మిక నటించారు. ఫిబ్రవరి 14వ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే, సల్మాన్ ఖాన్ 'సికిందర్' సినిమాలోనూ రష్మిక నటిస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు 'థామ', 'కుబేర', 'ది గర్ల్‌ఫ్రెండ్', 'రెయిన్ బో' చిత్రాలతోనూ రష్మిక బిజీగా ఉన్నారు.