ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులతో రాష్ట్రపతి భవన్ ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంది. ఈ రోజు మాత్రం సినిమా తారల సందడితో కళకళలాడుతోంది. జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం కారణంతో పలువురు నటీనటులు, దర్శక రచయితలు, సాంకేతిక నిపుణుల సందడితో కొత్త కళ సంతరించుకుంది.
తెలుగు నుంచి వెళ్లిన నిఖిల్ సిద్ధార్థప్రతి ఏడాదీ సినిమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. అయితే, కరోనా కారణంగా రెండేళ్లు ఆ వేడుకలు జరగలేదు. ప్రస్తుతం ప్రదానం చేస్తున్న అవార్డులు 2022 ఏడాది చేసిన సినిమాలవి.
Also Read: 2024 ఇయర్ ఎండ్‌లో మళ్ళీ నేషనల్ అవార్డ్స్ - నాలుగు నెలల్లో ఇంకోసారి ఎందుకు ఇస్తున్నారంటే?
కన్నడ సినిమా 'కాంతార'కు గాను ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, తమిళ సినిమా 'తిరు చిత్రాంబళం'కు గాను ఉత్తమ నటిగా నిత్యా మీనన్ అవార్డులు అందుకున్నారు. మలయాళ సినిమా 'ఆట్టమ్' ఉత్తమ సినిమాతో పాటు మరో రెండు అవార్డులు అందుకుంది. తెలుగులో ఉత్తమ సినిమాగా నిఖిల్ సిద్ధార్థ పాన్ ఇండియా ఫిల్మ్ 'కార్తికేయ 2' అందుకుంది. ఆ అవార్డు తీసుకోవడానికి నిఖిల్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ వెళ్లారు. పలువురు తారలు సందడి చేశారు. ఆ వేడుక లైవ్ ఇక్కడ చూడండి.
Also Read: నిర్మాతల చుట్టూ తిరిగిన రిషబ్... ఎయిర్ పోర్టులోనూ రిక్వెస్టులు... 'కాంతార' తెర వెనుక కహాని!