70th National Awards 2024: 70వ నేషనల్ అవార్డులను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022లో విడుదలైన చిత్రాలను ఎంపిక చేస్తూ శుక్రవారం (ఆగస్టు 16) అవార్డుకు ఎన్నికైన సినిమాలు, నటీనటుల జాబితాను విడుదల చేసింది కేంద్రం. ఈ జాబితాలో మరోసారి మన దక్షిణాది చిత్రాలు సత్తాచాటాయి. ఈ 70వ నేషనల్ అవార్డు మన తెలుగు సినిమా 'కార్తికేయ-2' ఎన్నికవ్వడం విశేషం. ఇక ఉత్తమ కన్నడ చిత్రంగా 'కేజీఎఫ్-2' నిలవగా.. ఉత్తమ నటుడిగా కన్నడ నటుడు, కాంతార ఫేం రిషబ్ శెట్టి ఎన్నికయ్యారు.
అలాగే ఉత్తమ నటిగా నిత్యామీనన్, మానసి పరేఖ్‌లు నేషనల్ అవార్డుకు ఎన్నికయ్యారు. తమిళ చిత్రం తిరుచిత్రంబళంలోని తన నటనకుగానూ నిత్యామీనన్ ఈ అవార్డును గెలుపుపొందగా.. 'కచ్ ఎక్స్‌ప్రెస్' గుజరాతీ చిత్రానికి గానూ మానసి పరేఖ్ ఈ అవార్డును కైవసం చేసుకున్నారు. ఇటీవల ఇదే చిత్రానికి గానూ నిత్యామీనన్ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్ట్ గెలుచుకుంది. ఉత్తమ నటి అవార్డు (క్రిటిక్) క్యాటగిరిలో ఆమెకు ఫిల్మ్‌ఫేర్ వరించింది. ఇప్పుడు ఇదే చిత్రానికిగానూ నేషనల్ అవార్డు అందుకోవడం విశేషం.
నిత్యామీనన్ 'తిరుచిత్రంబళం'
తవిళ స్టార్ హీరో ధనుష, నిత్యామీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం తిరుచిత్రంబళం. ఆగస్ట్ 2022లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్లీపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోనే నిత్యామీనన్ నటనకు విమర్శకులు ప్రశంసలు అందుకుంది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తమిళ దర్శకుడు మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ధనుష్, నిత్య మంచి స్నేహితులుగా కనిపించారు.
ఇందులో వారిద్దరు తిరు, శోభన పాత్రలు పోషించారు. డెలివరీ బాయ్ అయిన తిరు, తన తాత (భారతిరాజా)తో మంచి కలిసి నివసిస్తుంటాడు. అయితే పోలీసు అధికారి అయిన తన తండ్రి (ప్రకాష్ రాజ్)తో మంచి అనుబంధాన్ని కోరుకుంటాడు. ఈ క్రమంలో స్నేహితురాలి నిత్యామీనన్ అన్నింటిలో అతడిగా సపోర్టుగా ఉంటుంది. మంచి స్నేహితులైన వీరిద్దరు ఆ తర్వాత లైఫ్ పార్ట్‌నర్ ఎలా అయ్యారనేదే ఈ సినిమా కథ. ఫ్యామిలీ, ఎమోషన్స్ చక్కటి స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మానసి పరేఖ్ 'కచ్ ఎక్స్‌ప్రెస్'
మానసి పరేఖ్ హీరోయిన్‌గా 2022లో తెరకెక్కిన చిత్రం 'కచ్ ఎక్స్‌ప్రెస్'. ఇది గుజరాతి మూవీ. జనవరి 6, 2022న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో మానసి హీరోయిన్‌గా నటించడమే కాకుండా నిర్మాతగాను వ్యవహరించింది. ఇందులో భర్త చేతిలో మోసపోయిన మహిళ తన ఒంటిరిగా తన ఉనికిని ఎలా చాటుకుందనేది ఈ సినిమా కథ. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు మహిళలకు మంచి మెసేజ్ ఒరియంటెడ్‌గా ఉన్న ఈ సినిమాలో మానసి తన అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరితో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది.
Also Read: కార్తికేయ - 2 చిత్రానికి జాతీయ అవార్డు, ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి - మొత్తం లిస్ట్ ఇదే