Naresh VK Video About Idupu Kayitham Title Controversy: ప్రియదర్శి, నాగదుర్గ జంటగా వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో 'బన్నీ' వాస్, సుకుమార్ సతీమణి తబిత నిర్మిస్తున్న 'ఇడుపు కాయితం' ఇటీవల పూజతో ప్రారంభమైంది. అయితే... ఆ టైటిల్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది. నెటిజన్స్ కొందరు టైటిల్ అర్థం కాలేదని, సబ్ టైటిల్స్ వేస్తారా? అంటూ నెగటివ్‌గా స్పందించడంతో వివాదం పెద్దది అయ్యింది. దానిపై సీనియర్ హీరో, నటుడు నరేష్ విజయకృష్ణ స్పందించారు.
ఇడుపు కాయితాన్ని జాతీయ సమస్యగా మార్చేశారు! 'ఇడుపు కాయితం' టైటిల్ అర్థం కాలేదని, సబ్ టైటిల్స్ వేసి విడుదల చేస్తే ఆంధ్ర ప్రాంత ప్రజలు హ్యాపీగా ఫీలవుతామని ఓ నెటిజన్ చేసిన ట్వీట్, 'ఆంధ్ర వర్సెస్ తెలంగాణ'గా సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దారి తీసింది. ఆఖరికి, కేసీఆర్ కుమార్తె - టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యక్తిగత విమర్శలు ఈ వివాదాన్ని వాడుకున్నారు. 'ఇడుపు కాయితం' అంటే ఏమిటో అర్థం కాకపోతే పవన్ కళ్యాణ్‌ను అడగాలని పర్సనల్ లైఫ్ టార్గెట్ చేశారు కవిత. పవన్ మూడు పెళ్లిళ్లు - విడాకులపై ఆమె వ్యంగ్యంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఓ టైటిల్‌ను సామాన్య ప్రజలు లేదా కొందరు నెటిజన్లు 'జాతీయ సమస్య'గా మార్చడంపై నరేష్ విజయకృష్ణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
''తెలంగాణ, రాయలసీమ, కోనసీమ, ఉత్తరాంధ్ర.. ఏ ప్రాంతపు మాండలికం అయినా సరే తెలుగు భాషలోని గొప్పదనానికి నిదర్శనం. మనకి మనం మన సొంత భాష, మాండలీకాలను అవమానపరుచుకోవడం అంటే... తెలుగువాడిగా సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయం'' అని నరేష్ విజయకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మన భాషను మనం గౌరవించుకోవాలి తప్ప... ఇలా విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
Also Read: Sambarala Yeti Gattu - సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
కరుప్పు, కాంతార సినిమాలను చూశారుగాసినిమాను సినిమాగానే చూడాలని నరేష్ విజయకృష్ణ పేర్కొన్నారు. తమిళ, కన్నడ, మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు చూస్తున్న విజయన్ని ఆయన గుర్తు చేశారు. ''మన ప్రేక్షకులకు 'కరుప్పు', 'కాంతార' టైటిళ్లకు అర్థాలు తెలియకపోయినా ఆదరించారు. ఘన విజయం అందించారు. అలాంటప్పుడు మన తెలుగు భాషలోని ఒక పదాన్ని టైటిల్‌గా పెడితే వివాదం చేయడం సమంజసం కాదు. సినిమాను సినిమాగా చూడాలి'' అని నరేష్ విజయకృష్ణ కోరారు.
Also Read: Maa Inti Bangaram Collections Day 9: సమంత దూకుడుకు సాటేది... తొమ్మిదో రోజూ బంగారం కలెక్షన్స్ సూపరే
తెలుగు భాషా సంఘం చొరవ తీసుకోవాలి!'ఇడుపు కాయితం' టైటిల్ వివాదానికి వెంటనే ముగింపు పలకాలని నరేష్ విజయకృష్ణ విన్నవించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఈ వివాదంపై తెలుగు భాషా సంఘం చొరవ తీసుకుని చర్చించాలి. ప్రభుత్వాలతో పాటు మీడియా, నెటిజన్లు అందరూ కలిసి ఇకనైనా ఈ వివాదానికి ముగింపు పలకాలి. మన సొంత భాషను మనమే నరుక్కుంటే అది మనకే నష్టం'' అని హెచ్చరించారు. తెలుగు భాషను కాపాడుకుందామని, భాషతో పాటు మాండలికాలను కించపరిచే ధోరణికి ముగింపు పలకాలని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు నరేష్.
