Nara Rohith About Nandamuri Mokshagna Tollywood Entry: నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై తాజాగా మరోసారి వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఆయన ట్రెడిషనల్ లుక్‌లో కనిపించగా వైరల్ అయ్యింది. డెబ్యూ మూవీ కోసం ఆయన ఆ లుక్ మెయింటెయిన్ చేస్తున్నారంటూ నందమూరి ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు సైతం కామెంట్స్ చేశారు. తాజాగా మోక్షజ్ఞ రీసెంట్ లుక్‌పై నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఎస్... మూవీస్ కోసమే...
ఇండస్ట్రీలోకి వచ్చేందుకు నందమూరి వారసుడు మోక్షజ్ఞ చాలా ఉత్సాహం, ఆసక్తిగా ఉన్నారని నారా రోహిత్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన... త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. 'ఇటీవల మోక్షజ్ఞతో మాట్లాడినప్పుడు స్క్రిప్ట్ కోసం చూస్తున్నట్లు చెప్పాడు. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇండస్ట్రీకి రావడం కోసం మోక్షజ్ఞ ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. గతంలో కంటే లుక్‌లో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. తాను కోరుకుంటున్నట్లు మంచి లవ్ స్టోరీ ఉంటే ఈ ఏడాదే ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వొచ్చు.' అని స్పష్టం చేశారు.
గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య తనయుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆయన ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో పూజా కార్యక్రమాల వరకూ వెళ్లిన ఆయన మూవీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. 'హను మాన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారనే ప్రచారం సాగింది. మోక్షజ్ఞ హీరోగా 'ఆదిత్య 999' మూవీని తెరకెక్కిస్తారనే టాక్ వినిపించింది. అయితే, ప్రశాంత్ వర్మ వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో బాలయ్య పర్మిషన్ తీసుకుని మరీ... మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి కాస్త టైం అడిగారట. ఈలోపు మోక్షజ్ఞ కూడా డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్‌పై పూర్తిగా సంసిద్ధం కావడానికి టైం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వల్లే ఆ మూవీకి బ్రేక్ పడిందనే వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి.
తాజాగా మోక్షజ్ఞ కొత్త ట్రెడిషనల్ లుక్ వైరల్ కాగా... ఆయన ఎంట్రీ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా నారా రోహిత్ మూవీస్ కోసమే ఆ లుక్ అంటూ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై యంగ్ లయన్‌ను చూడబోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బాలయ్యతో మూవీపై నారా రోహిత్
దీంతో పాటే బాలకృష్ణతో మల్టీ స్టారర్‌పై నారా రోహిత్ తాజాగా ఇంటర్వ్యూలో స్పందించారు. కథ రెడీ అయ్యి ఇద్దరికీ లుక్ టెస్ట్ కూడా అయ్యిందని... అయితే, బాలయ్యకు వరుస సినిమాలు, ఎలక్షన్స్ ఉండడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని చెప్పారు. 'బాలయ్య నటించిన మరో సినిమాలోనూ నేను గెస్ట్ రోల్ చేయాల్సి ఉంది. అది కూడా కొన్ని కారణాల వల్ల కుదరలేదు. భవిష్యత్తులో బాలయ్యతో కలిసి నటించే ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. ఆ రోజు కోసమే వెయిటింగ్.' అంటూ చెప్పారు. నారా రోహిత్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫుల్ లెంగ్త్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ 'సుందరకాండ' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.