Nara Rohith's Sundarakanda Movie Non Theatrical Rights Big Deal: రీసెంట్‌గా 'భైరవం' మూవీతో మోస్తరు సక్సెస్ అందుకున్న యంగ్ హీరో నారా రోహిత్ మరో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'సుందరకాండ'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆగస్ట్ 27న సినిమా రిలీజ్ కానుండగా... రిలీజ్‌కు ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
బిగ్ డీల్... ఆ ఓటీటీలోకి...
ప్రస్తుతం టాలీవుడ్‌లో నాన్ థియేట్రికల్ బిజినెస్ సినిమాకి కీలకంగా మారిన క్రమంలో 'సుందరకాండ' జాక్ పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. రిలీజ్‌కు ముందే రూ.12 కోట్ల డీల్ కుదిరింది. మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ స్టార్ మా, జియో హాట్ స్టార్ సంస్థ రూ.12 కోట్లకు సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత 'జియో హాట్ స్టార్' ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ కానుండగా... ఆ తర్వాత 'స్టార్ మా' ఛానల్‌లో ప్రీమియర్ కానుంది. తెలుగు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రూ.9 కోట్లు, హిందీ డబ్బింగ్ అండ్ ఆడియో రైట్స్ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
కంటెంట్ నచ్చడంతో...
హాట్ స్టార్‌కు చెందిన 3 టీమ్స్ కంటెంట్ చూసి మరీ బాగా నచ్చడంతో బిగ్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్‌కు ముందే ఇంత నాన్ థియేట్రికల్ బిజినెస్ సాధించడం మంచి పరిణామమని మూవీ టీం హర్షం వ్యక్తం చేస్తోంది. బలమైన కంటెంట్ ఉంటే ఓటీటీ సంస్థలు భారీగా డీల్ ఇస్తాయని మరోసారి ప్రూవ్ అయ్యిందని తెలిపింది.
ఈ మూవీకి వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తుండగా ఆయనకు ఇది ఫస్ట్ మూవీ. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ సరసన వ్రితి వాఘనితో పాటు శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సీనియర్ యాక్టర్ నరేష్, అభినవ్ గోమటం కీలక పాత్ర పోషించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించగా... ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ కెరీర్‌లో ఇది 20వ చిత్రం.
Also Read: నా ప్రాణానికే ముప్పు ఉంది - మరోసారి హీరోయిన్ తనుశ్రీ దత్తా షాకింగ్ కామెంట్స్