యువ కథానాయకుడు నిఖిల్ (Nikhil Siddharth), అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటిస్తున్న సినిమా 'కార్తికేయ 2' (Karthikeya 2). సినిమాలో తొలి పాట 'నన్ను నేను అడిగా...' (Nannu Nenu Adiga Song)ను ఈ రోజు విడుదల చేశారు.
'అడిగా నన్ను నేను అడిగా... నాకెవ్వరు నువ్వని!
అడిగా నిన్ను నేను అడిగానే... నిన్నలా లేనని!
నవ్వుతూ నన్ను కోసినావే... గాయమైన లేకనే!
చూపుతో ఊపిరి ఆపినావే... మార్చి నా కథ ఇలా!
నువ్వే కదా ప్రతీ క్షణం క్షణం పెదాలపై...
నీతో ఇలా ఇలా జగం సగం నిజం కదా!' అంటూ సాగే ఈ పాటను కృష్ణ మదినేని రాశారు. కాలభైరవ (Kala Bhairava) అద్భుతమైన బాణీ అందించారు. ఇన్నో గెంగా ఆలపించారు. మంచు కొండల్లో ప్రయాణం చేస్తుండగా... హీరో హీరోయిన్ల మధ్య చోటు చేసుకున్న క్యూట్ లిటిల్ రొమాంటిక్ మూమెంట్స్‌ను చక్కగా చిత్రీకరించారు.
ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో భావం ఏంటనేది కళ్ళకు కట్టినట్టు చూపించింది. సముద్ర గర్భంలో దాచుకున్న అతి పెద్ద రహస్యం ద్వారకా నగరం అంటూ 'కార్తికేయ 2' మీద అంచనాలు పెంచారు దర్శకుడు చందూ మొండేటి.
'కార్తికేయ 2'ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలుత జూలై 22న విడుదల చేయాలని ప్లాన్ చేసినా... వాయిదా వేశారు.
Also Read : అఖిల్ అక్కినేని సినిమాకు పవన్ కళ్యాణ్ టైటిల్?
ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని.
Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు