నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా 'దసరా' విజయం తర్వాత శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' (The Paradise Movie). ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిందీ సినిమా. విడుదల వాయిదాతో పాటు హిందీ వెర్షన్ రిలీజ్ విషయంలో నెలకొన్న వివాదాలు, నిర్మాతల మధ్య గొడవలు వంటి అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

Continues below advertisement

క్లైమాక్స్ సీజీ వర్క్ అవ్వలేదు...వాయిదాకు అసలు కారణం అదే!నిజానికి రామ్ చరణ్ 'పెద్ది'తో పాటు మార్చి నెలాఖరున విడుదల కావాల్సిన సినిమా 'ది ప్యారడైజ్'. అయితే వాయిదా పడింది. చివరకు, సెప్టెంబర్ 24న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. అయితే, ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాల టాక్. వాయిదా వెనుక అసలు కారణం క్లైమాక్స్‌లోని ఓ సీక్వెన్సులో గ్రాఫిక్స్ (CG) పనులు పూర్తి కాకపోవడమే అట.

'ది ప్యారడైజ్' క్లైమాక్స్ సీజీ వర్క్స్ కోసం నిర్మాత సుధాకర్ చెరుకూరి ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నార. ఆ వర్క్ పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టేలా ఉందట. దాంతో తప్పనిసరి పరిస్థితిల్లో సినిమా విడుదలను వాయిదా వేశారట. ఒక్క వారం ఆలస్యంగా అక్టోబర్ 1న విడుదల కావచ్చని టాక్.

Continues below advertisement

Also Read: Bigg Boss 10 First Elimination - 'బిగ్ బాస్ 10' స్టేజిపై ఎలిమినేషన్... క్రిటిక్‌ను వెనక్కి పంపిన ఆడియన్స్

ప్రస్తుతానికి అక్టోబర్ 2న విక్టరీ వెంకటేష్ - గురూజీ త్రివిక్రమ్ కలయికలోని 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' విడుదలకు రెడీ అయ్యింది. అందువల్ల ఆ తేదీకి నాని వస్తారా? లేదా? అనేది చేయాలి. లేదూ అంటే అక్టోబర్ 8న గానీ, 29న గానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఇతర సినిమాలు కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి.

Also Read: Mohan Babu Making Matcha - జపనీస్ గ్రీన్ టీ 'మాచా' తయారీలో మోహన్ బాబు... వైరల్ వీడియో

హిందీ విడుదల వివాదంపై స్పష్టత'ది ప్యారడైజ్' విడుదల వాయిదా సంగతి పక్కన పెడితే... హిందీ వెర్షన్ విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ లేరని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. భారీ బడ్జెట్‌తో 'ది ప్యారడైజ్' తీస్తున్నారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. ఆల్రెడీ నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్లతో హిందీ రిలీజ్ డీల్స్ గురించి డిస్కషన్స్ చేస్తున్నారట. అవి త్వరలో పూర్తి కానున్నాయట. 'ది ప్యారడైజ్' తెలుగు వెర్షన్‌తో పాటే హిందీలో కూడా విడుదల కానుంది.

పెరిగిన 'ది ప్యారడైజ్' బడ్జెట్...థియేట్రికల్ కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్!'ది పారడైజ్'ను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. ముందుగా ప్లాన్ చేసినప్పటికీ... అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు షూటింగ్ జరగడంతో బడ్జెట్ దాటినట్టు తెలుస్తోంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీగా ఖర్చు చేశారు. ఓటీటీ డీల్స్ వల్ల కొంత అమౌంట్ వస్తుంది. అయితే... నిర్మాత లాభాల బాట పట్టాలంటే ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ ద్వారా భారీ అమౌంట్ వస్తుందని ఆశిస్తున్నారు. మరో వైపు సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్లలో 'నిర్మాత నాగవంశీకి 25 శాతం వాటా ఉందట. తమ హారిక అండ్ హాసిని సంస్థ నుంచి వస్తున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47'కు పోటీగా అక్టోబర్ మొదటి వారంలో 'ది ప్యారడైజ్'ను విడుదల చేయడానికి ఆయన సుముఖంగా లేరట.

రెండు సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో వస్తే కలెక్షన్స్ తగ్గుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 'ది ప్యారడైజ్'కు థియేట్రికల్ కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకని అక్టోబర్ 1న కాకుండా 8న విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ.

Also Read: Maremma First Review By Ravi Teja: మారెమ్మకు మాస్ మహారాజా రివ్యూ... రవితేజకి నచ్చేసింది... అబ్బాయికి హిట్టే