Bigg Boss 10 Tamil First Elimination: తెలుగుతో పాటు తమిళ్ 'బిగ్ బాస్' సీజన్ 10 స్టార్ట్ అయ్యేది కూడా సెప్టెంబర్ 6నే. ఇక్కడ నాగార్జున హోస్ట్ చేస్తే... అక్కడ షోకి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హోస్ట్. షో మొదలు అవ్వక ముందు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యే విషయం బయటకు వచ్చింది. స్టేజిపై మొదటి ఎలిమినేషన్ చోటు చేసుకుంది. 

Continues below advertisement

ప్రశాంత్ రంగస్వామిని వెనక్కి పంపిన ఆడియన్స్బిగ్ బాస్ 10 తమిళ్ హౌస్‌లో అడుగు పెట్టాలని కలలు కన్నారు తమిళ్ క్రిటిక్ ప్రశాంత్ రంగస్వామి (Prashanth Rangaswamy). అయితే... ఆయన ఆశలపై తమిళ్ ఆడియన్స్ నీళ్ళు చల్లారు. బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్లనివ్వకుండా స్టేజి మీద నుంచి వెనక్కి వచ్చేలా చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

'బిగ్ బాస్' తమిళ్ సీజన్ 10 స్టేజిపై ముగ్గురు కంటెస్టెంట్లను నిలబెట్టారు. అందులో ప్రశాంత్ రంగస్వామి ఒకరు. ఆ ముగ్గురికీ ఓ టాపిక్ ఇచ్చారు. మిగతా ఇద్దరూ (జవిత్, పృథ్వీనాథ్ ) మోడల్స్. వాళ్ళకు ఓ టాపిక్ ఇచ్చి ఒక్కొక్కరినీ రెండేసి నిమిషాల చొప్పున మాట్లాడమని టాస్క్ ఇచ్చారు. ఎవరు మాట్లాడినది నచ్చితే వాళ్ళకు ఓటు వేయమని ప్రేక్షకులను కోరారు. ఆ టాస్కులో ప్రశాంత్ రంగస్వామికి ఓటమి ఎదురైంది. బిగ్ బాస్ తమిళ్ 10 స్టేజి మీద నుంచి ఆయన వెనక్కి రావాల్సి వచ్చింది. దాంతో షో మొదలైన మొదటి రోజే ఎలిమినేషన్ చోటు చేసుకుంది. 

Continues below advertisement

Also Read: Mohan Babu Making Matcha - జపనీస్ గ్రీన్ టీ 'మాచా' తయారీలో మోహన్ బాబు... వైరల్ వీడియో

తనపై ప్రేమ, ద్వేషం చూపించినందుకు 'ఎక్స్' వేదికగా థాంక్స్ చెప్పారు ప్రశాంత్ రంగస్వామి. తాను డిజప్పాయింట్ అవ్వలేదని, తనకు రిగ్రెట్స్ కూడా లేవని ఆయన పేర్కొన్నారు. మళ్ళీ పనిలో పడ్డానని చెప్పారు. షో మొదటి రోజు నుంచి ఎమోషనల్ అయ్యిందని, ప్రశాంత్ రంగస్వామి ఎలిమినేట్ అవ్వడం తనకు షాకింగ్ అని విజయ్ సేతుపతి చెప్పినట్టు సమాచారం.

Also Read: Maremma First Review By Ravi Teja: మారెమ్మకు మాస్ మహారాజా రివ్యూ... రవితేజకి నచ్చేసింది... అబ్బాయికి హిట్టే

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' సినిమాపై తమిళనాట వివాదం నెలకొనడానికి ఓ విధంగా ప్రశాంత్ రంగస్వామి కారణం అని చెప్పాలి. కుమారస్వామి ఉత్తరాదిన జన్మించాడని సినిమా అనౌన్స్ చేసినప్పుడు చిత్ర బృందం పేర్కొంటే... తమిళుడైన కుమారస్వామిని ఉత్తరాదిన జన్మించాడని ఎలా చెబుతారు? అంటూ సోషల్ మీడియాలో తొలుత రచ్చ చేసింది ప్రశాంత్ రంగస్వామి. ఆ తర్వాత తమిళ తంబీలు, రాజకీయ నాయకులు కామెంట్స్ చేశారు.

Also Read: Supritha Boyfriend - సుప్రీతా బాయ్‌ఫ్రెండ్ కాదు... అతను 'గే' - వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ లేదు