Nani's The Paradise Release Date : నేచరల్ స్టార్ నాని, దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతోన్న అవెయిటెడ్ పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామా ది ప్యారడైజ్ (The Paradise). గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి విపరీతంగా చర్చ సాగుతోంది. రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా పడబోతోందంటూ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా... దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Continues below advertisement

'వదంతులు నమ్మొద్దు'

అయితే, 'ది ప్యారడైజ్' థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ గురించి ఎవరూ ఎలాంటి వదంతులు నమ్మొద్దని... ఏదైనా ఉంటే అఫీషియల్‌గా తామే రివీల్ చేస్తామంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మూవీకి సంబంధించి అన్నీ అప్డేట్స్‌ను చిత్ర నిర్మాణ సంస్థే అఫీషియల్‌గా షేర్ చేస్తుందని స్పష్టం చేశారు. మూవీ పోస్ట్ పోన్ అవుతుందనే ప్రచారంపై మాత్రం వారు స్పందించలేదు.

Continues below advertisement

ఈ సినిమా తొలుత మార్చిలో వస్తుందని గతేడాది అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఆగస్ట్ 21కి మార్చారు. కానీ, షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ప్రమోషన్స్‌కు తగిన టైం లేకపోవడం వల్ల సినిమా రిలీజ్‌ను అనుకున్న తేదీకే 'ది ప్యారడైజ్' రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

Also Read : Romantic Drama Series OTT : ఓటీటీలోకి 12th ఫెయిల్ హీరో రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

గతంలో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబో రిపీట్ అవుతుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలో జడల్ పాత్రలో నాని డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, ఫస్ట్ గ్లింప్స్, ఆయా షేర్ సాంగ్ సూపర్ ట్రెండ్ అవుతోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, శికంజి మాలిక్‌గా మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు, తనికెళ్ల భరణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 1960 బ్యాక్ డ్రాప్‌లో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామాగా సినిమా తెరకెక్కుతున్నట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. తనను నమ్మిన వారికి అండగా నిలిచే యోధుడిగా పవర్ ఫుల్ వారియర్‌గా నాని కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా... SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, స్పానిష్, బెంగాళీ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Chennai Love Story : జన నాయగన్ Vs చెన్నై లవ్ స్టోరీ - థియేటర్స్ కాంట్రవర్సీపై ప్రొడ్యూసర్ SKN క్లారిటీ

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.