Sai Pallavi's Ek Din Movie OTT Streaming : బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా, టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ఏక్ దిన్ (Ek Din). ఆమెకు బాలీవుడ్‌లో ఇదే ఫస్ట్ మూవీ. తెలుగులో ఈ సినిమాను ఒక రోజుగా రిలీజ్ చేశారు. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, ఇందులో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్.

Continues below advertisement

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video)లో ఏక్ దిన్ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో రెండు బిగ్ ట్విస్టులు ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతానికి ఈ మూవీ ఇండియన్ ప్రేక్షకులకు అందుబాటులో లేదు. ఓవర్సీస్ ఆడియన్స్ కేవలం రెంటల్ విధానంలో మాత్రమే మూవీని చూడగలరు. అలాగే, జులై 16 (గురువారం) నుంచి ఇండియన్ ఆడియన్స్‌కు కూడా మూవీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Continues below advertisement

ఈ మూవీకి సునీల్ పాండే దర్శకత్వం వహించగా... ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మన్సూర్ ఖాన్, ఆమిర్ ఖాన్, అపర్ణా పురోహిత్ నిర్మించారు. రామ్ సంపత్ మ్యూజిక్ అందించగా... 'వన్ డే' థాయ్ అనే సినిమా ఆధారంగా దీన్ని రూపొందించారు.

Also Read : Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...

స్టోరీ ఏంటంటే?

దినేష్ (జునైద్ ఖాన్) ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగి. చూడ్డానికి స్టైలిష్‌గా కాకుండా సాధారణ అబ్బాయిలా ఉండడంతో ఆఫీసులో ఏ అమ్మాయి కూడా అతన్ని పట్టించుకోదు. అయితే, దినేష్ మాత్రం తన కొలీగ్ మీరా (సాయి పల్లవి)ని ఇష్టపడతాడు. కానీ మీరా తన బాస్‌తో రిలేషన్‌లో ఉంటుంది. ఓసారి ఆఫీస్ కొలీగ్స్ అంతా కలిసి జపాన్ ట్రిప్ వెళ్తారు. అక్కడ తన ప్రేమ విషయం మీరాతో చెప్పాలని ప్రయత్నిస్తాడు దినేష్. అలా వారిద్దరికీ ఓసారి ప్రైవసీ టైం దొరుకుతుంది. మరి మీరాకు తన ప్రేమ విషయం చెప్పాడా? ఈ జర్నీలో మీరా దినేష్ గురించి ఏం తెలుసుకుంది? మీరా గురించి దినేష్‌కు తెలియని విషయం ఏంటి? ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Pallichattambi OTT : పళ్లిచట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.