The Paradise Team Responds About Rumours: టాలీవుడ్ హీరో నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మూవీ 'ది ప్యారడైజ్'. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై రోజుకో రూమర్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రూమర్స్ స్ప్రెడ్ చేసే వారిని జోకర్స్‌తో పోలుస్తూ చిత్రబృందం తాజాగా ఓ స్పెషల్ నోట్ రిలీజ్ చేసింది. అందులో 'గజరాజు నడుస్తుంటే గజ్జి కుక్కలు అరుస్తాయి' అంటూ టీం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
జోకర్లంతా జాగ్రత్తగా ఉండండి
నాని ఖాతాలో ప్రస్తుతం క్రేజీ లైనప్ ఉంది. అందులో నాని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవెయిటింగ్ మూవీ 'ది ప్యారడైజ్'. ఇప్పటికే పోస్టర్, గ్లిమ్స రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ షూటింగ్ కూడా షురూ కాకముందే భారీ ధరకు ఓటీటీ డీల్ కుదిరినట్టు వార్తలు వినిపించాయి. అలాగే ఇటీవల ఈ సినిమా ఆగిపోయింది అంటూ రూమర్లు వచ్చాయి. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో నాని అసంతృప్తిగా ఉన్నారని, మార్పులు చేర్పులు చేయాలని కోరడం, తర్వాత బడ్జెట్ ఇష్యూలు యాడ్ కావడంతో ఈ సినిమాను ఆపేస్తున్నారని టాక్ నడిచింది. తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ చిత్ర యూనిట్ గట్టిగానే సమాధానం చెప్పింది.
స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన 'ది ప్యారడైజ్' టీం
ఈ మేరకు సోషల్ మీడియాలో 'ది ప్యారడైజ్' టీం రిలీజ్ చేసిన పోస్ట్ లో "ది ప్యారడైజ్ ప్రాజెక్టుపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. సినిమా విషయంలో అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. దాని గురించి ఎవ్వరూ కంగారు పడాల్సిన పనిలేదు. సినిమాను అద్భుతంగా రూపొందిస్తున్నాం. త్వరలోనే మీరందరూ దాన్ని తెరపై చూస్తారు. అప్పటివరకూ కొంతమంది రూమర్స్‌తో బతికేయొచ్చు. గజరాజు నడుస్తూ ఉంటే గజ్జి కుక్కలు అరుస్తాయి. 'ది ప్యారడైజ్' సినిమాపై ఫ్యాన్స్ చూపించే అభిమానాన్ని మేము దగ్గరగా చూస్తున్నాం. మాకు వ్యతిరేకంగా వస్తున్న ద్వేషాన్ని, సినిమాపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారాన్ని కూడా గమనిస్తున్నాం. ప్రేమను అలాగే ద్వేషాన్ని కూడా తీసుకుంటాము. అలాగే అన్నింటిని ఒక శక్తిగా మారుస్తాము. అది 'ది ప్యారడైజ్' మూవీని టాలీవుడ్ నుంచి వచ్చే గొప్ప సినిమాల్లో ఒకటిగా మారుస్తుంది. ఈలోగా మీకు వీలైనంత ఎక్కువగా ప్రయత్నించండి.
ఆ ట్వీటర్లు/ ఫీడర్లందరికీ... గెట్ వెల్ సూన్ జోకర్స్. మా చిత్రబృందంలోని అన్నీ విభాగాలు మీ అందరి కోసం ఒక కొత్త ప్రపంచాన్ని తీసుకురావడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాయి. మనమందరం గర్వపడే స్థాయిలో సినిమాకు నిర్మిస్తామని వాగ్దానం చేస్తున్నాము" అని పేర్కొన్నారు. ఇక రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్లందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము అంటూ సాలిడ్ సమాధానం చెప్పారు. మరి ఇప్పటికైనా ఆ రూమర్లకి చెక్ పడుతుందా అనేది చూడాలి.
'ది ప్యారడైజ్' మూవీని వచ్చే ఏడాది మార్చ్ 26న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ ఇలా మొత్తం 8 భాషలలో రిలీజ్ చేయబోతున్నారు.