Nani Set To Team Up With Hi Nanna Director Shouryuv: 'హిట్ 3'తో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న నేచరల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం 'దసరా' ఫేం శ్రీకాంత్ ఓదెలతో హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' మూవీ చేస్తుండగా వచ్చే ఏడాది మార్చి 26న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తర్వాత 'సాహో', 'ఓజీ' మూవీస్ ఫేం సుజీత్‌తో మూవీ చేయబోతున్నారు. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రాబోతుండగా నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది.
పీరియాడికల్ యాక్షన్ డ్రామా
తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు కూడా నేచరల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. 'హాయ్ నాన్న' డైరెక్టర్ శౌర్యువ్‌తో పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మూవీని 2026 సంక్రాంతికి అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. సుజిత్‌తో సినిమా పూర్తయ్యాక ఈ పీరియాడికల్ డ్రామాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది.
శౌర్య్యువ్‌తో ఫస్ట్ మూవీ 'హాయ్ నాన్న' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అటు ఓటీటీలోనూ అదరగొట్టింది. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా పాధర్, డాటర్ సెంటిమెంట్‌తో అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. డైరెక్టర్ శౌర్యువ్ పీరియాడికల్ డ్రామాలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పడంతో నాని వెంటనే ఓకే చెప్పేశారట. ఇక 'ది ప్యారడైజ్', సుజీత్‌తో మూవీ తర్వాత శౌర్యువ్ మూవీ ట్రాక్ ఎక్కనుంది. ఇక దీని తర్వాత 'జై భీమ్' ఫేం టీజీ జ్ఞానవేల్‌తో ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయట. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: హీరోగా ఎంట్రీ ఇస్తున్న పాపులర్ యూట్యూబర్ - సిల్వర్ స్క్రీన్‌పై హిట్ కొడతాడా?
నాని 'ది ప్యారడైజ్' మూవీ విషయానికొస్తే ఇదివరకు ఎన్నడూ చేయని రోల్‌లో 1960 బ్యాక్ డ్రాప్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ మూవీలో మోహన్ బాబు విలన్‌గా చేస్తారనే ప్రచారం జరుగుతుండగా... అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రీసెంట్‌గా ఓ ప్రెస్ మీట్‌లో మంచు లక్ష్మి ఈ విషయాన్ని పొరపాటున కన్ఫర్మ్ చేశారు. బాలీవుడ్ నటుడు రాఘవ్ జ్యుయెల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 26న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.