Saripodhaa Sanivaaram Trailer Out: నేచులర్‌ స్టార్‌ నాని,ప్రియాంక మోహన్‌ ఆరుళ్ హీరోహీరోయిన్లుగా డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సరిపోదా శనివారం'. ఆగస్టు 29న ఈ మూవీ విడుదలకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ దురదర్శన్‌ థియేటర్లో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ మూవీ అంచనాలు పెంచేస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్, టీజర్‌, పాటలకు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన వచ్చింది.


యాక్షన్‌, థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా నాని సరికొత్తగా కనిపంచబోతున్నాడు. ఇక ఇందులో ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపంచబోతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఉంటే యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఇటీవల ఎస్‌జే సూర్య బర్త్‌డే సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్ చేశాడు. ఇందులో నాని, ప్రియాంక మోహన్‌ రాధ కృష్ణుడులా.. ఎస్‌జే సూర్యను నరకాసురుడిలా వర్ణిస్తూ ఈ బర్డ్‌డే గ్లింప్స్‌ వదిలారు. ఇందులో ఎస్‌జే సూర్య, నానిల మధ్య చూపించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. దీంతో ట్రైలర్‌పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. అలా భారీ అంచనాల మధ్య నేడు విడుదలైన ట్రైలర్‌ బాగా ఆకట్టుకుంటుంది. 



ట్రైలర్‌ మొదట కూల్‌గా సాగింది. "నా సహనం నశించింది.. నా కన్నీళ్లు ఇంకిపోయాయి.. అందుకే మనందరి భయాన్ని దాటి ఒక అడుగు ముందుకు వెద్దామనుకుంటున్నా" అంటూ ఓ చిన్న పిల్లాడి వాయిస్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఆ తర్వాత విలన్‌ ఎంట్రీ చూపించారు. కానిస్టేబుల్‌ లుక్‌లో ఉన్న హీరోయిన్‌ సర్‌ సిఐ ఎప్పుడు వస్తారని సీరియన్‌ కానిస్టెబుల్‌ని అడుగుతుంది. ఆ సీనియర్‌ కానిస్టేబుల్‌ పాత్రలో నటుడు శుభలేఖ సుధాకర్‌ కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. ఆ తర్వాత సీఐగా ఎస్‌జే సూర్య ఎంట్రీ వస్తుంది.


ఆయన పాత్ర కనిపించగానే ట్రైలర్‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది. సీఐగా మానవ రూపంలో ఉన్న రాక్షసుడిలా కనిపించాడు. ఆ తర్వాత సాయి కుమార్‌ యముడు, చిత్రగుప్తుడు డైలాగ్‌తో హీరో పాత్రను చూపించారు. ట్రైలర్‌ సాయి కుమార్‌ నాని పాత్రను వివరిస్తూ ఉండగా.. బ్యాగ్రౌండ్‌లో నాని యాక్షన్‌ చూపించారు. "నాకు కోపం వచ్చింది... నాకు కోపం వచ్చిందంటే వీడు నా వాడు. ఇది నా సమస్య" అనే డైలాగ్‌ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్‌ దయ పేరు డైరీలో రాసుకోవడం.. హీరోకి, విలన్‌కి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూపించారు. ఆ తర్వాత వీడేవడో శనివారం కోడుతున్నాడనే డైలాగ్ ఆసక్తిని పెంచుతుంది. ఇక తర్వాత ట్రైలర్‌ మొత్తం యాక్షన్‌ సీన్స్‌తో సాగింది. ఇప్పటి నుంచి విలన్‌ పాత్రలను అలా పరిచయం చేశారు.



హీరో మీద కోపంతో తన కుటుంబం విలన్లు దాడి చేయడం, ఆ తర్వాత  మీరో విలన్లపై విరచుకుపడం ఇలా ట్రైలర్ ఇంటెన్సీవ్‌ యాక్షన్‌ సీన్స్‌ చూపించారు. మధ్యలో "ఇప్పటి వరకు వాడి రెండు కళ్లు మాత్రమే చూశారు.. మూడో కన్ను చూశారో.. శివతాండవమే" అనే డైలాగ్ మూవీపై ఇంటెన్స్‌ క్రియేట్‌ చేస్తుంది. ఇక చివరిలో "పోతారు.. అంతా పోతారు" అనే డైలాగ్ ట్రైలర్‌ ముగిసింది. ఫుల్‌ యాక్షన్‌తో నిండిన ఈ ట్రైలర్‌కు జెక్స్‌ బిష్ణోయ్‌ అందించిన ఇచ్చిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మరింత హైలెట్‌ అయ్యింది. మొదటి నుంచి చివరిగా వరకు తన అద్బుతైన స్కోర్‌తో ట్రైలర్‌ దద్దరిల్లేలా చేశాడు. ఇక ట్రైలర్‌ను మొదటి నుంచి చివరి వరకు ఆడియన్స్‌ని కట్టిపడేసేలా మలిచి మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేశాడు డైరెక్టర్‌. ప్రస్తుతం ట్రైలర్‌ బాగా ఆకట్టుకుంది. 


Also Read: "నాకు కోపమొచ్చింది.." - 'సరిపోదా శనివారం' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నాని కామెంట్స్‌