Saripodhaa Sanivaaram First Single Update: నాచురల్ స్టార్ నాని వరుస హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. గత ఏడాది నాని నటించిన 'దసరా' మూవీ పాన్ ఇండియా హిట్ కొట్టింది. విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో వందకోట్ల క్లబ్‌లో చేరిన నాని మార్కెట్ ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. దీంతో నాని సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నాని నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.
వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో 'అంటే సుందరానికి' మూవీ వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీసు ఆశించిన విజయం ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మళ్లీ అదే డైరెక్టర్‌తో నాని జతకట్టి నటిస్తున్న ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తోడు విడుదలకు ముందే ఈ మూవీ డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ బిజినెస్ భారీ జరుగుతున్నాయి. దీంతో సరిపోదా శనివారంపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్కొ అప్‌డేగ్ వదులున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి త్వరలోనే పస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. దీనిపై తాజాగా నాని సోషల్ మీడియాలో వేదికగా ఓ అప్‌డేట్ ఇచ్చాడు.
గరం.. గరం అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్‌ను జూన్ 15న విడుదల చేయబోతున్నారు. ఇదే విషయాన్ని నాని ప్రకటిస్తూ ఫ్యాన్స్‌ని అలర్ట్ చేశాడు. "వేడి వేడిగా వడ్డించబోతున్నాం" అంటూ గరం గరం సాంగ్ ఏ రేంజ్ ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు. చూస్తుంటే ఇది మూవీలో మాస్ సాంగ్ అనిపిస్తుంది. కాగా దసరాతో తని మాస్ యాంగిల్ చూపించిన నాని సరిపోదా శనివారంలో మరోసారి మాస్ ఆడియన్స్ ఆకట్టుకోబోతున్నాడు. మరి ఈ చిత్రంలో నాని మాస్ లుక్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఈ ఫస్ట్ గ్లింప్స్‌తో చూపించబోతున్నారేమో అంటున్నారు ఫ్యాన్స్. నాని పోస్ట్‌కి వెయిటింగ్ అంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు.
కాగా దసరా, హాయ్ నాన్న సినిమాల భారీ హిట్ కావడంతో ఈ సినిమాకు నాని భారీ రెమ్యునరేషన్ పెంచాడట. ఈ చిత్రానికి ఏకంగా రూ.25 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడని సినీవర్గాల్లో గుసగుస. ఇప్పటివరకు నాని మరే సినిమాకి ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోలేదట. బాక్సాఫీసు వద్ద నాని సినిమాలకు క్రేజ్, డిమాండ్ కూడా పెరిగింది. ఇక నేషనల్ వైడ్‌గా నాని మార్కెట్ పెరగడంతో నిర్మాతలు కూడా అతడు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారని సినీ సర్కిల్లో టాక్.
ఓటీటీ రైట్స్
'సరిపోదా శనివారం' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయాన్ని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర్ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు అని తెలిసి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాతో నానికి మంచి సక్సెస్ అందడంతో పాటు దిల్ రాజుకు బాగానే లాభాలు రావడం పక్కా అంటున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఢిల్ కూడా భారీగా జరిగిందని సమాచారం. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అన్ని భాషలకు కలిపి ఏకంగా రూ. 45 కోట్లకు ఢిల్ కుదుర్చుకుందట.