Saripodhaa Sanivaaram OTT Partner and Streaming Details: నేచులర్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ 'సరిపోదా శనివారం'. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇవాళ(ఆగస్టు 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. నాని, ఎస్‌జే సూర్యలు (SJ Suryah) పోటాపోటీగా నటించారు.. యాక్షన్స్‌ సీన్స్‌ అదిరిపోయాయంటున్నారు. దసరా, హాయ్‌ నాన్న చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన నానికి ఖాతాలో మరో హిట్‌ పడినట్టే అంటున్నారు.


ఇక సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram OTT Release) మూవీకి హిట్‌ టాక్‌ రావడంతో మూవీ డిజిటల్‌ ప్రీమియర్‌పై ఆసక్తి నెలకొంది. ఓటీటీకి ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలో వస్తుందని సినీప్రియులు తెగ ఆరా తీస్తున్నారు. అయితే 'సరిపోదా శనివారం' మూవీ హక్కులను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇప్పటికే దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. మూవీకి ముందు నుంచి ఉన్న బజ్‌ దృష్ట్యా ఈ సినిమాను భారీ ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.






Nani Saripodhaa Sanivaaram OTT Rights: అయితే నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) కేవలం సౌత్‌ రైట్స్‌ను మాత్రమే దక్కించుకున్నట్లు సమాచారం. మరోవైపు హిందీ ఓటీటీ హక్కులను జియో సినిమా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 45 కోట్లకు మూవీని డిజిటల్‌ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్టు సమాచారం. నాని కెరీర్‌లో దసరా తర్వాత అత్యంత ఓటీటీ ధర పలికిన చిత్రం ఇదేనట. ఇక ఒప్పందం ప్రకారం కొత్త మూవీ థియేట్రికల్‌ రన్‌ అనంతరం రెండు నెలలకు ఓటీటీకి వస్తుంది. కానీ, అది మూవీ రిజల్ట్‌, ఓటీటీలతో ఒప్పందం బట్టి ఉంటుంది. 



Also Read: అవి మహిళల కనీస అవసరాలు - హేమ కమిటీ నివేదికపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!


అయితే సరిపోదా శినివారం మాత్రం మూవీ రిలీజ్‌కు నెల రోజుల్లోనే వచ్చే అవకాశం ఉందట. సెప్టెంబర్‌లో డిజిటల్‌ ప్రీమియర్‌కు ఇచ్చేలా నెట్‌ఫ్లిక్స్‌ నిర్మాతలతో డీల్‌ కుదుర్చుకుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. అయితే ఈ చిత్రం సెప్టెంబర్‌ 26న ఓటీటీకి రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఎస్‌జే సూర్య విలన్‌గా నటించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.  రామ్ -లక్ష్మణ్‌లు ఫైట్‌ మాస్టర్స్‌గా వ్యవరించిన ఈ సినిమా పాన్‌ ఇండియాగా విడుదలైంది. 


Also Read: యంగ్‌ హీరో తేజ సజ్జాకు నాని వార్నింగ్‌ - ట్వీట్‌ వైరల్‌, ఏమైందంటే..