మే 28... విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao Birth Anniversary) జయంతి. ఆ రోజు తెలుగు ప్రజలు అందరూ ఆయన్ను స్మరించుకునే రోజు. 1923లో ఆయన జన్మించారు. ఈ ఏడాది మే 23కు ఈ భూమి మీద ఆయన అడుగుపెట్టి వందేళ్లు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ (NTR) శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.


విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మస్థలమైన నిమ్మకూరులో మే 28వ తేదీ ఉదయం  ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఎన్టీఆర్ కుమారుడు, ప్రముఖ కథానాయకుడు, హిందూపూర్ ఎమ్మెల్యే 'నట సింహం' నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేతుల మీదుగా అత్యంత ఘనంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు.


తెలుగు ప్రజలు, సినిమా ప్రేక్షకుల గుండెల్లో నందమూరి తారక రామారావు స్థానం ఎప్పటికీ సుస్థిరమైనది. రాముడు, కృష్ణుడు... ఇలా ఎన్నో పాత్రలకు ఆయన ప్రాణం పోశారు. ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారు. రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలో ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన ఆయన, ఎంతో సేవ చేశారు. తెలుగు భాషపై, తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం.


Also Read: బాలయ్య సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ - రోల్ ఏంటంటే?


మే 28వ తేదీ ఉదయం నిమ్మకూరులో ప్రారంభమైన శత జయంతి వేడుకలు, ఆ రోజు మధ్యాహ్నం గుంటూరులోనూ, సాయంత్రం తెనాలిలోనూ జరగనున్నాయి. ఆ తర్వాత ఈ ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారట. వాటిని సైతం బాలకృష్ణ ఆధ్వర్యంలో, ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలకు నందమూరి అభిమానులు, తెలుగు ప్రజలు భారీగా హాజరు కాబోతున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.


Also Read: విజయ్ దేవరకొండ, సమంత సినిమా 'ఖుషి' ఫస్ట్ లుక్ ఇదిగో, రిలీజ్ ఎప్పుడంటే?