'కెజియఫ్ 2'... ప్రేక్షకులు ఇప్పట్లో ఈ సినిమాను మర్చిపోవడం అంత సులభం కాదు! థియేటర్లలో హీరో యశ్ అండ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇచ్చిన హై అటువంటిది మరి! ముఖ్యంగా 'కెజియఫ్ 2'లో యాక్షన్ సీక్వెన్సులు చాలామందికి నచ్చాయి. హీరోయిజం ఎలివేట్ కావాలంటే ఇటువంటి యాక్షన్ తప్పనిసరి అని ఒక స్టాండర్డ్ సెట్ చేశాయి. 'కెజియఫ్ 2'లో ఉన్నట్టే కమల్ హాసన్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఉంటే... ఈ ప్రశ్నకు సమాధానం విక్రమ్ ట్రైలర్ ఇచ్చింది.


లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'విక్రమ్'. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు ఈ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదలైంది. అందులో ఒక్క సీక్వెన్స్ 'కెజియఫ్ 2' సినిమాను గుర్తు చేసిందని చెప్పాలి.


'కెజియఫ్ 2' టీజర్ గుర్తు ఉందా? పోనీ, సినిమా? అందులో యశ్ పోలీస్ స్టేషన్ మీద, స్టేషన్ ముందు ఉన్న జీపులు మీద ఫైరింగ్ చేస్తాడు. సినిమాలో ఆ గన్‌కు 'పెద్దమ్మ' అని పేరు పెడతారు. నిజానికి అది అమెరికన్ మేడ్ ఎం1919 బ్రౌనింగ్ మెషీన్ గన్ (American-made M1919 Browning machine gun). ఇప్పుడు 'విక్రమ్' ట్రైలర్ విషయానికి వస్తే... 2.10 నిమిషాల దగ్గర కమల్ హాసన్ ఒక గన్ పట్టుకొని షూట్ చేస్తాడు. అప్పుడు ముందు ఉన్న కార్లు గాల్లోకి ఉంటాయి. గన్ ఫైరింగ్ దెబ్బకు! 'కెజియఫ్ 2'లో కూడా సేమ్ అలాగే జీపులు గాల్లోకి లేస్తాయి. 'విక్రమ్' ట్రైలర్ ఆ షాట్‌ గుర్తు చేసిందని చెప్పాలి. 


నిజం చెప్పాలంటే... 'కెజియఫ్ 2' కంటే ముందు కూడా ఇటువంటి గన్ ఫైరింగ్ షాట్స్ ఉన్నాయి. 'విక్రమ్' దర్శకుడు లోకేష్ కానగరాజ్ తీసిన 'ఖైదీ' చూస్తే... ఆ సినిమా క్లైమాక్స్‌లో కార్తీ భారీ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తాడు. 


Also Read: బాలయ్య సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ - రోల్ ఏంటంటే?


'మాస్టర్' కమర్షియల్ ఫార్మటులో తీశాడని, అందులో లోకేష్ కానగరాజ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయని ప్రేక్షకులు అన్నారు. 'విక్రమ్' ట్రైలర్ చూస్తే... ఈ దర్శకుడు మళ్ళీ తన స్టయిల్‌లోకి వచ్చినట్టు కనబడుతోంది. 'మానగరం', 'ఖైదీ' తరహాలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ తీసినట్టు ఉన్నారు. జూన్ 3న 'విక్రమ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read: కమల్ హాసన్ 'విక్రమ్' ట్రైలర్ - యాక్షన్ పీక్స్