Daaku Maharaaj Grand Success Meet : గాడ్ ఆఫ్ మోసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీ 150 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టడంతో చిత్రబృందం ఖుషీగా ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న అనంతపురంలో జరిగిన 'డాకు మహారాజ్' సక్సెస్ మీట్ లో బాలయ్య తన స్పీచ్ తో అదరగొట్టారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డాకు మహారాజ్'. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించగా, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతెల ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన 'డాకు మహారాజ్' సంచలన వసూళ్లు సాధిస్తూ, బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం అనంతపురంలో 'డాకు మహారాజ్' విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించింది చిత్ర బృందం.
బాలయ్య స్పీచ్ హైలెట్స్...'డాకు మహారాజ్' సక్సెస్ ఈవెంట్ లో బాలయ్య స్వయంగా 'గణ గణ ఆంధ్ర తెలంగాణ' అనే పాటను పాడి అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.
దేశానికి ఒక రాష్ట్రపతి నిచ్చింది రాయలసీమ, అభివక్త ఆంధ్ర ప్రదేశ్ కి ఆరుగురు ముఖ్యమంత్రులను ఇచ్చింది, తెలుగు జాతి కోసం పిడికిలి బిగించిన ఒక మహనీయుడిని గుండెల్లో పెట్టుకుంది అదే రాయలసీమ... ఇది రాయలసీమ కాదు రాయల్ సీమ.
'డాకు మహారాజ్' మూవీకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చేసిన 'ఆదిత్య 369' సినిమాలో కృష్ణదేవరాయ లాంటి గుర్తుండే పాత్ర చేయాలని ఆలోచనలోంచి ఈ 'డాకు మహారాజ్' పుట్టింది.
కోవిడ్ టైంలో ధైర్యం చేసి 'అఖండ' చేశాం. అది సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి... ఇప్పుడు 'డాకు మహారాజ్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఈ సినిమలన్నీ ప్రేక్షకులతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సంతోషపడేలా చేశాయి.
నా తండ్రి, గురువు, దైవం నందమూరి తారక రామారావు గారు ఇంత పెద్ద కుటుంబాన్ని అభిమానుల రూపంలో ఇచ్చారు. ఆయన బిడ్డగా పుట్టడం అనేది నా జన్మ జన్మల పుణ్యం ఫలం.
అభిమానులే నా ప్రచారకర్తలు. వాళ్లకు నా రికార్డులు, కలెక్షన్లు, అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని తెలుసు.
డైరెక్టర్ బాబీ ట్యాలెంటెడ్, తమన్ గురించి అందరికీ తెలిసిందే. కెమెరామెన్ విజయ్ కార్తీక్ విజువల్స్, యుగంధర్ విఎఫ్ఎక్స్ అదరగొట్టారు. శేఖర్ మాస్టర్ 'దబిడి దిబిడి' సాంగ్ కు డ్యాన్స్ తో అదరగొట్టారు. నాది, ప్రగ్యా జైస్వాల్ ప్రయాణం 'అఖండ' నుంచి మొదలైంది. అందం, నటన కలబోసుకున్న నటి ఆమె. శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ లో ఫైర్ బ్రాండ్. అనంత శ్రీరామ్, క్యాసర్ల శ్యామ్ అద్భుతమైన సాహిత్యం అందించారు అంటూ బాలయ్య చిత్ర బృందానికి పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు.