నట సింహం నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ప్రయోగాలకు వెనుకాడలేదు. కథల పరంగా, లుక్స్ పరంగా కొత్తదనం కోసం ఆయన అన్వేషిస్తూ ఉంటారు. 'భైరవ ద్వీపం' సినిమాలో కురూపిగా కనిపించడం నుంచి మొదలు పెడితే... 'అఖండ'లో అఘోర పాత్ర వరకూ ఎన్నో లుక్స్‌లో బాలయ్య కనిపించారు. ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా ఆయన స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తుంటారు. అనిల్ రావిపూడి సినిమాలో కూడా అటువంటి స‌ర్‌ప్రైజ్‌ ప్లాన్ చేశారట.


Nandamuri Balakrishna to get a new makeover for Anil Ravipudi Film: ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ, ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ హీరోయిన్ శ్రీలీలకు తండ్రిగా, 50 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తిగా బాలయ్య కనిపించనున్నారు. క్యారెక్టర్ మాత్రమే కాదు, బాలకృష్ణ లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందట. రోల్ కోసం ఆయన మేకోవర్ కానున్నారని తెలుస్తోంది. బాలయ్య లుక్‌ను అనిల్ రావిపూడి పూర్తిగా మారుస్తున్నారట.


బాలకృష్ణ లుక్ ఎలా ఉండాలనే విషయంలో అనిల్ రావిపూడి పూర్తి క్లారిటీతో ఉన్నారని యూనిట్ వర్గాల టాక్. ఆల్రెడీ లుక్ డిజైన్ చేయించారట. బాలయ్య పుట్టినరోజు నాడు విడుదల చేయాలని భావించినప్పటికీ... షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు ఎందుకని ఆగినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా. సరైన సమయంలో, సరైన సందర్భంలో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. సెప్టెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆ తర్వాతే లుక్ విడుదల చేస్తారు. 


Also Read: శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?


బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో ప్రతినాయిక పాత్రలో నటించే అవకాశం అంజలికి దక్కింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Also Read : స్విస్, ఫ్రాన్స్ to గ్రీస్ - ప్రగ్యా జైస్వాల్ టూర్ ఫొటోస్, వీడియోస్ చూశారా?