Nandamuri Balakrishna: బాలకృష్ణ, అంజలి కలిసి నటించిన మూవీ ఏంటో తెలుసా? అందుకే తోశారంటున్న ఫ్యాన్స్!

Balakrishna and Anjali Video: తాజాగా జరిగిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్‌గా వచ్చిన బాలయ్య.. అంజలిని తోసేసి అందరినీ షాక్‌కు గురిచేశారు. అయితే ఆయన ప్రవర్తనను ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు.

Continues below advertisement

Balakrishna Shocking Behavior with Anjali: సీనియర్ హీరో బాలకృష్ణ.. ఎప్పుడు స్టేజ్ ఎక్కినా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే వెళ్తారు. ముఖ్యంగా తన సినిమాలకంటే ఇతర ఆర్టిస్టుల సినిమాలకు గెస్టులగా వెళ్లినప్పుడు బాలయ్య ప్రవర్తన ప్రేక్షకులు మాట్లాడుకునేలా ఉంటుంది. తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలకృష్ణ చీఫ్ గెస్టుగా వెళ్లినప్పుడు కూడా అదే జరిగింది. ఈ ఈవెంట్‌లో స్టేజ్‌పైనే హీరోయిన్ అంజలిని తోసేశారు బాలయ్య. దీంతో ఒక్కసారిగా అలా చేశారేంటి అంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన ప్రవర్తనను సమర్ధించుకోవడానికి తన ఫ్యాన్స్ ముందుకొచ్చారు.

Continues below advertisement

చనువుతోనే..

బాలకృష్ణ, అంజలి కలిసి ‘డిక్టేటర్’ అనే సినిమాలో నటించారు. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2016లో విడుదలయ్యింది. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వకపోయినా బాలకృష్ణ, అంజలికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పటి నుండే అంజలికి బాలయ్యతో చనువు ఉందని, అందుకే ఆయన సరదాగా అలా తోశారని ఆయన ఫ్యాన్స్ కవర్ చేస్తున్నారు. కొందరు మాత్రం బాలయ్య కావాలనే ఇలా చేశారని విమర్శిస్తున్నారు.

అసలు ఏం జరిగింది.?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఈవెంట్‌లో స్టేజ్‌పై ఉన్న అందరినీ పక్కకు జరగమని చెప్తున్నారు బాలకృష్ణ. అంజలి మెల్లగా పక్కకు జరుగుతున్నా కూడా తనను ఉన్నట్టుండి వెనక్కి నెట్టేశారు. బాలయ్య ప్రవర్తనకు అంజలి ఒక్కసారిగా షాక్ అయినట్టు అనిపించినా.. వెంటనే తన పక్కన ఉన్న నేహా శెట్టి చేయి పట్టుకొని గట్టిగా నవ్వేసింది. అంజలి నవ్వుతునే ఉన్నా కూడా బాలకృష్ణ ఫేస్ మాత్రం సీరియస్‌గానే ఉంది. ఆ తర్వాత అంజలికి సీరియస్‌గా ఏదో చెప్పారు. ఆ తర్వాత హైఫై ఇచ్చారు. దీంతో అంజలితో కావాలనే బాలయ్య ఫన్ చేసినట్టుగా ఫ్యాన్స్ చెప్తున్నారు.

విశ్వక్‌తో ఫన్..

ఈవెంట్స్‌లో బాలకృష్ణ ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారి ఏం కాదని మరికొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చి హాట్ టాపిక్‌గా మారారు బాలయ్య. ఇదంతా పక్కన పెడితే ఆయన రావడం వల్లే ఈవెంట్‌లో ఫన్ ఏర్పడిందని ఫ్యాన్స్ అంటున్నారు. విశ్వక్ సేన్‌తో కలిసి బాలయ్య చేసిన కామెడీ, ఆయన స్పీచ్.. అన్నీ ప్రేక్షకులను నవ్వించాయి. విశ్వక్ సైతం బాలయ్యను చాలా స్పెషల్‌గా ఫీలవుతాడు. ఎప్పటికప్పుడు తనకు బాలకృష్ణపై ఉన్న ఇష్టాన్ని బయటపెడుతూనే ఉంటాడు. ఈసారి తన మూవీ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా కూడా పిలిచాడు.

Also Read: హీరోయిన్‌ అంజలితో బాలయ్య అనుచిత ప్రవర్తన - షాకింగ్‌ వీడియో వైరల్‌

Continues below advertisement
Sponsored Links by Taboola