'టసింహం' నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) క్రేజ్‌ గురించి తెలిసిందే. తన తండ్రి, దివంగత మాజీ  సీఎం నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. బాలనటుడిగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఆయన ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్‌, బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందించారు. 50 ఏళ్లుగా తన సినిమాలలో ఆడియన్స్‌ని అలరిస్తున్నారు. అలగే రాజకీయ నాయకుడుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ విజయం అందుకున్న ఆయన సినీ, రాజకీయ రంగంలో సక్సెస్‌ ఫుల్‌గా రాణిస్తున్నారు. ఇటీవల  నటుడిగా ఆయన 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.


ఇదిలా ఉంటే ఈ నందమూరి నటసింహం రెండు తెలుగు రాష్ట్రాలకు భారీగా విరాళం ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. "50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది.. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది- వెలుగుతూనే ఉంది.. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం.



నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు., తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను"  మీ నందమూరి బాలకృష్ణ అంటూ నోట్‌ విడుదల చేశారు.



వరద బాధితులకు అండగా సినీ ఇండస్ట్రీ


ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాలన్ని వరదలతో నిండిపోతున్నాయి. ఎక్కడిక్కడ ఇల్లు మునిగిపోతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. దీంతో ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఆ వరదల్లో ఎంతోమంది గల్లంతు అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని ఖమ్మం జిల్లాలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. దీంతో సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, స్టార్‌ హీరోలు, నిర్మాతలు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటించారు. వైజయంతీ మూవీస్‌, హారికా అండ్‌ హాసినీ నిర్మాణ సంస్థలు చేరో రూ. 25 లక్షలు విరాళాలు ప్రకటించాయి.  ఈ సందర్భంగా వారు "ఈ రాష్ట్రం మాకెంతో ఇచ్చింది. ప్రకృతి పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు మేం కొంత తిరిగి ఇవ్వాలనుకున్నాం. ఇది మా బాధ్యత" అని పేర్కొన్నారు.  


Also Read: ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్, సిద్ధూ, నిర్మాతలు... వరద బాధితుల సహాయార్థం ఎవరెంత విరాళం ఇచ్చారంటే?


అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇండస్ట్రీ తరపున రూ. కోటీ విరాళం ప్రకటించారు. అలాగే యంగ్‌ హీరో ఇద్ధూ జొన్నలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 30 లక్షల విరాళం అందించారు. పీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 15 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 15 లక్షలు విరాళం ప్రకటించారు. ''ఇది కొంత మందికి అయినా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. మరో యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణకు ఐదేసి లక్షల చొప్పున విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.