ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో  చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ బృందం సమావేశం అయింది. అయితే జగన్‌తో భేటీకి ఎవరెవరు వెళ్తారన్న దానిపై చివరి క్షణం వరకూ సస్పెన్స్ నెలకొంది. ఎవరెవర్ని ఆహ్వానించారో తనకు స్పష్టత లేదని తనకు ఆహ్వానం వచ్చిందని తాను వెళ్తున్నానని విమానం ఎక్కే ముందు కూడా చిరంజీవి వ్యాఖ్యానించడంతో తాడేపల్లికి చేరుకునేవారెవరన్నదానిపై ఇక చివరి క్షణం వరకూ క్లారిటీ రాలేదు. అయితే సమావేశం కోసం తాడేపల్లికి చేరుకున్న వారిలో హైదరాబాద్‌లో బయలుదేరిన వారు కాక అలీ, పోసాని ,నారాయణమూర్తి మాత్రమే అదనంగా తాడేపల్లిలో కలిశారు. 


అసౌకర్యానికి చింతిస్తున్నాం.. మరోసారి అలా జరగకూడదని సీఎం జగన్ ఆదేశం !


సీఎం జగన్ వీరితోనే చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు వరకూ సీఎం జగన్‌తో భేటీ కోసం టాలీవుడ్ నుంచి నాగార్జున, ఎన్టీఆర్ కూడా వస్తారన్న ప్రచారం జరిగింది. సీఎం జగన్‌తో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల వ్యక్తిగతంగా వెళ్లి జగన్‌తో భేటీ అయ్యారు.  సీఎం జగన్‌ను చూసి చాలా రోజులు అయిందని చూసేందుకు వచ్చానని చెప్పారు. అంత స్నేహం ఉన్న నాగార్జన టాలీవుడ్ సమస్యలపై చర్చించేందుకు జరిగే భేటీకి కూడా హాజరవుతారని అనుకున్నారు. 


టికెట్ల సమస్యకు నేటితో శుభం కార్డు పడే ఛాన్స్! ఎవర్ని పిలిచారో తెలీదు, ఎయిర్‌పోర్టులో చిరంజీవి కీలక వ్యాఖ్యలు


గతంలో టాలీవుడ్ తరపున జరిగినభేటీల్లో నాగార్జున పాల్గొన్నారు. కానీ అనూహ్యంగా నాగార్జున హాజరు కాలేదు. కారణమేమిటో స్పష్టత లేదు. గతంలో చిరంజీవి ఒక్కరే సీెం జగన్‌తో భేటీ అయినప్పుడు .. తనకు కూడా ఆహ్వానం వచ్చిందని కానీ బంగార్రాజు ప్రమోషన్స్‌లో బిజీగా ఉండటం వల్ల వెళ్లలేకపోయానన్నారు., ఇప్పుడు కూడా అలాంటి వ్యాపార వ్యవహారాల మీద బిజీగా ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ హీరో  ఎన్టీఆర్ కూడా సీఎం జగన్‌తో భేటీకి అంగీకరించారని ప్రచారం జరిగింది.  అయితే మిగతా హీరోలు వేరు.. ఎన్టీఆర్ వేరు. 


ఆయన జగన్‌తో జరిగే భేటీలో పాల్గొని.. ఆ తర్వాత ప్రభుత్వం గురించి పాజిటివ్‌గా మాట్లాడితే అది రాజకీయ అంశం అవుతుంది. ఆ కోణంలో ఆలోచించి ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా టాలీవుడ్ నుంచి అగ్రహీరోలుగా ఉన్న చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్‌తో పాటు నిర్మాతలు అలాగే వైఎస్ఆర్‌సీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న అలీ, పోసానితో పాటు నారాయణమూర్తి కూడా హాజరవుతున్నారు. సమస్యలకు పరిష్కారం ఖరారు చేసుకునే అవకాశం ఉంది.