ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతించారు. నిన్నటి విశాఖ పర్యటన సందర్భంగా గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సీఎంవో తెలిపింది. దీనికి కారణమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నానన్నారు.
జగన్ టూర్‌లో పోలీసుల రూల్స్ ! మద్యం దుకాణం మాత్రమే ప్రత్యేకం.. మిగతావన్నీ మూత !
విశాఖ శారదాపీఠంలో సీఎం జగన్ పాల్గొన్న ప్రైవేటు కార్యక్రమం కోసం దాదాపుగా నాలుగు గంటల పాటు ప్రజలకు పోలీసులు నరకం చూపించారు. సింధియా-షీలానగర్, ఎయిర్ పోర్ట్ మార్గాల్లో చాలా సేపు వాహనా లను నిలిపివేశారు. రోడ్లను ఎక్కడిక్కకడ బ్లాక్ చేశారు. ఫలితంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు .ఎయిర్‌పోర్టుకు వచ్చే రహదారుల్లో 3 గంటలపాటు వాహనాలు నిలిచిపో యాయి. దీంతో సింధియా, షీలానగర్ ప్రాంతాల్లోని ప్రజలు కూడా రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
విశాఖ శారదాపీఠంలో సీఎం జగన్ - రాజశ్యామల యాగం నిర్వహణ
విమాన ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారికికూడా అనుమతి ఇవ్వలేదు. ఫ్లైట్ టిక్కెట్లు చూపించినా అనుమతి ఇవ్వలేదు. దీంతోవిమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందు లు ఎదుర్కొన్నారు. మూడు గంటల పాటు అనుమతి ఇవ్వకపోవడంతో కొంతమంది తమ లగేజీతో కాలినడకనే వెళ్లారు. పోలీసుల వైఖరిపై విమాన ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఓ మహిళ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము ఎక్కాల్సిన విమానం వెళ్లిపోతే టికెట్ ఛార్జీలు ఇస్తారా? అని మండిపడ్డారు.
మంత్రి సిదిరి అప్పలరాజుకు చేదు అనుభవం.. అలిగి వెనక్కి తగ్గిన మంత్రి!
సీఎం జగన్ వస్తున్నారని ఎయిర్‌పోర్టు నుంచి శారదాపీఠం వరకూ దుకాణాలను మూసి వేయించారు. పలు చోట్ల బారీకేడ్లు కట్టారు. దీంతో వ్యాపారులు కూడా అసంతృప్తికి గురయ్యారు. ముఖ్యమంత్రి వస్తే మాత్రం ప్రజలను బయటకు రాకుండా ఎవరూ వ్యాపారాలు చేసుకోకుండా ఏర్పాట్లు చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆగ్రహం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సీఎం జగన్ స్పందించినట్లుగా తెలుస్తోంది. మరోసారి ఇలా జరగకుండా చూడాలని ఆదేశించారు. దీంతో యీ సారి సీఎం జగన్ పర్యటనల్లో దుకాణాల మూసివేతలు.. బారీకేడ్లు కట్టడాలు.. రోడ్లను బ్లాక్ చేయడం లాంటివి ఉండవని భావిస్తున్నారు.