Naga Shaurya's Bad Boy Karthik Release Date Fixed : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తిక్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతేడాది ఇదే టైంకు షూటింగ్ పూర్తైనా టీజర్ రిలీజ్ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Continues below advertisement

రిలీజ్ ఎప్పుడంటే?

నాగశౌర్య కొత్త సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు అఫీషియల్‌గా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మూవీకి రామ్ దేశిన దర్శకత్వం వహించగా... ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. నాగశౌర్య మాస్ న్యూ లుక్‌లో అదరగొట్టారు. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు పొలిటికల్ టచ్ కూడా ఉన్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది.

Continues below advertisement

నాగశౌర్య సరసన విధి యాదవ్ హీరోయిన్‌గా నటించారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా డైలాగ్ కింగ్ సాయి కుమార్, హీరోయిన్ పూర్ణ కీలకపాత్రలు పోషించారు. అలాగే, సముద్రఖని, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, సీనియర్ నరేష్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. హ్యారీష్ జయరాజ్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు.

Also Read : మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ - ది రాజాసాబ్ తప్పులు రిపీట్ కాకుండా... రామయ్య ఆశీస్సులతో...

మూడేళ్ల తర్వాత...

రంగబలి డిజాస్టర్ తర్వాత నాగశౌర్య దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తైనా వివిధ కారణలతో కొత్త మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసే ఆయన ఈసారి కూడా మాస్ లుక్‌తో అదరగొట్టనున్నారు. దిక్కులు చూడకు రామయ్య, ఛలో, అమ్మమ్మ గారిల్లు, లక్ష్మీ రావే మా ఇంటికి, నర్తనశాల మూవీస్‌తో నాగశౌర్య ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు.