టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో నాగశౌర్య నుండి వస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక పోతున్నాయి. 'ఛలో' మూవీ తర్వాత నాగశౌర్య నుండి అరేంజ్ హిట్ మళ్లీ దక్కలేదు. దీంతో నాగశౌర్య ఇప్పుడు విభిన్న తరహా సినిమాలతో ప్రేక్షకులను ఆరాధించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే నాగ శౌర్య నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'రంగబలి'. ఈ చిత్రానికి పవన్ బసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ నేపథ్యంలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీని 'SLV' సినిమాస్ బై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి  మన ఊరిలో ఎవడ్రా ఆపేది అంటూ సాగే మొదటి పాట విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది.


పవన్ భాష్యం శెట్టి, శ్రీహర్ష ఈమని రచించిన ఈ పాట పవన్ సిహెచ్ ఎనర్జిటిక్ బిట్స్ తో సాగుతూ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు మూవీ యూనిట్. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మూవీ టీం ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో అనంత శ్రీరామ్ నటించడంతో పాటు కొన్ని పాటలు కూడా రాశారు. అయితే తాజాగా ఇంటర్వ్యూలో హీరో నాగశౌర్య అనంత శ్రీరామ్ పై సీరియస్ అవడం సర్వత్ర ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకీ నాగ శౌర్య అనంత శ్రీరామ్ పై ఎందుకు సీరియస్ అయ్యారంటే.. తాజా ఇంటర్వ్యూలో అనంత శ్రీరామ్ సినిమా సక్సెస్ లో లిరిక్ రైటర్ అనే వాడికి భాగమే లేదంటూ మూవీ టీం తో వాదనకు దిగాడు. దీంతో మూవీ టీం అతనికి సర్ది చెబుతున్నా కూడా వినకుండా లిరిసిస్ట్ అనే వాడికి కాస్త గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అని చెప్పారు.


ఆ తర్వాత సినిమా సక్సెస్ అయినప్పుడు లిరిక్ రైటర్ పేరుని ఏ ఒక్కడు చెప్పడు. ఎన్నో పాటలు మిలియన్ల కొద్ది వ్యూస్ సాధిస్తే ఆ సినిమాల బిజినెస్లు తారుమారయ్యాయో తెలీదా మీకు అంటూ వాదిస్తుండగా.. మధ్యలో నాగశౌర్య కలగజేసుకొని ‘‘సర్ మీరు 'ఊహలు గుసగుసలాడే' మూవీ లో ఏం సందేహం లేదు అనే పాట రాశారు. నా మొదటి సినిమాలోని సాంగ్ అది. ఆ పాట హిట్ అయి నేషనల్ అవార్డు వచ్చింది. వచ్చిందా లేదా? ఆ పాటకి మొత్తం 7 అవార్డులు వచ్చాయి. ఒక్కదానికైనా నన్ను పిలిచారా? తీసుకుంది మీరే కదా. మమ్మల్ని పిలిచారా? అప్పుడు మేము హర్ట్ అయ్యామా? చెప్పండి. సినిమాలో యాక్ట్ చేసింది నేను. డైరెక్ట్ చేసింది అవసరాలు శ్రీనివాస్ గారు. కానీ అవార్డు వచ్చినప్పుడు మమ్మల్ని పిలవలేదు. మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఇద్దరే వెళ్లారు’’ అని తెలిపాడు.


‘‘మనం ఇక్కడ డిబేట్ పెట్టుకోడానికి రాలేదు సర్.. మీరు ఉంటే ఉండండి లేకుంటే వెళ్లిపోండి. మేము మా సినిమాని ప్రమోట్ చేసుకుంటాం" అంటూ అనంత శ్రీరామ్ పై నాగశౌర్య సీరియస్ అవ్వడంతో.. ‘‘నాకు ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. లిరిక్ రైటర్ అనేవాణ్ణి గుర్తించకపోతే కష్టం’’ అంటూ అనంత్ శ్రీరామ్ ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోయారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే మూవీ టీమ్ అంతా కలిసే ఈ గొడవని కావాలని ప్లాన్ చేశారు. సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి. ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని ఈ వీడియో చివర్లో రివిల్ చేశారు. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ గతంలో కూడా చాలానే వచ్చాయి.



Also Read: పాన్ ఇండియా మూవీతో వస్తున్న నటి భావన - ఆసక్తి రేపుతున్న ‘ది డోర్’ ఫస్ట్ లుక్!