అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ జంట వివాహాన్ని అంగరంగ వైభవంగా చేశారు అక్కినేని నాగార్జున. అయితే తాజాగా నూతన వధూవరులు ఇద్దరూ శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. 


అక్కినేని నాగార్జునతో కలిసి నాగ చైతన్య - శోభిత జంట శుక్రవారం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఈ కొత్త జంట ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్టుగా తెలుస్తోంది. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించిన ఈ కొత్త దంపతులకు అర్చకులు ఆలయంలోకి స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు కొత్త జంటకు ఆశీర్వచనం అందించారు. మొత్తానికి పెళ్లి తరువాత కొత్త జంట ఇలా దైవ దర్శనం కోసం వీరి శ్రీశైలం సందర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  






ఇక నాగ చైతన్య - శోభిత పెళ్లి ఫోటోలను నాగార్జున ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి కొత్తజంటకు గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో 'డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఫ్యాన్స్... మీ ప్రేమ, ఆశీస్సులు ఈ వేడుకను మరింత స్పెషల్ గా చేశాయి. ఈ అందమైన క్షణాలలో మమ్మల్ని అర్థం చేసుకున్న మీడియాకు థాంక్స్. నా హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగుతోంది" అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక నిన్న పెళ్లి పూర్తయిన దగ్గర నుంచి మొదలు పెడితే... నాగ చైతన్య - శోభితల పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 


ఇప్పుడు శ్రీశైలం మల్లన్న సేవలో నాగ చైతన్య - శోభిత ఉన్న ఫోటోలు వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ రోజు ఉదయమే అక్కినేని నాగచైతన్య - శోభిత పెళ్లి వేడుక అనంతరం రింగ్ కోసం పోటీ పడిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అందులో భాగంగా వేడుకలో ఇద్దరికి నీటితో నిండిన ఒక బిందెలో రింగ్ ను వేసి తీయమన్నారు. సరదాగా సాగిన ఈ పోటీలో చివరికి చైతూనే గెలుపొందారు. మొత్తానికి అచ్చ తెలుగు సంప్రదాయంలో వీరిద్దరి పెళ్లి జరగడంతో అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. ఇక కొత్తగా పెళ్లయిన ఈ జంట కలకాలం సంతోషంగా ఉండాలని అక్కినేని అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు విష్ చేస్తున్నారు.


2022 నుంచి డేటింగ్ లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ పెళ్లితో దంపతులు కాగా, నూతన వధూవరులు నాగ చైతన్య - శోభితా ధూళిపాళ్లను ఆశీర్వదించడానికి ప్రముఖ నటీనటులు, దర్శకులు, హాజరయ్యారు. పెళ్ళికి హాజరైన అతిథుల లిస్ట్ లో రామ్ చరణ్ - ఉపాసన, మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, ప్రభాస్, చిరంజీవి - సురేఖ, నయనతార ఫ్యామిలీ, నాని ఆయన సతీమణి వంటి తదితర సెలబ్రిటీలు ఉన్నారు.


Read Also : Pushpa 2 The Rule: 'పుష్ప 2' థియేటర్లో వింత స్ప్రే కలకలం... అనారోగ్యానికి గురైన ఆడియన్స్... కేసు నమోదు