బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2' (Pushpa 2) జాతర ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ ను రఫ్ఫాడిస్తోంది. అయితే మరోవైపు ఈ సినిమా థియేటర్లలో జరుగుతున్న వరుస వింత సంఘటనలు అల్లు అర్జున్ అభిమానులను టెన్షన్ పడుతున్నాయి. తాజాగా ఓ థియేటర్లో గుర్తు తెలియని వ్యక్తి ఓ పదార్థాన్ని స్ప్రే చేశారని, దానివల్ల ఆడియన్స్ అనారోగ్యానికి గురైయ్యారనే వార్త బయటకు వచ్చింది. 


ఈ ఘటన ముంబైలో ఉన్న బాంద్రాలోని గెలాక్సీ థియేటర్లో జరిగింది. ఈ విచిత్రమైన సంఘటన వల్ల సినిమా దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షి అందించిన సమాచారం ప్రకారం ఇంటర్వెల్ టైంలో ప్రేక్షకులంతా బయటకు వెళ్లారు. తిరిగి లోపలికి వెళ్ళాక ఎవరో ఏదో స్ప్రే చేసినట్టుగా అనిపించిందట. దాని ఎఫెక్ట్ కారణంగా చాలామంది ప్రేక్షకులకు వెంటనే దగ్గు వచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే గొంతులో విచిత్రంగా అన్పించడం, వాంతులు చేసుకోవడం వంటివి జరిగాయట. ఈ ఊహించని హఠాత్పరిణామానికి దాదాపు 10 నిమిషాల పాటు షో ఆగిపోయిందని, ఇంటర్వెల్ అయ్యాక థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులకు చాలామందికి ఇదే పరిస్థితి ఎదురు కావడం అనుమానాలను రేకెత్తించింది. ఆ స్మెల్ దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉందని, విషయాన్ని గమనించిన థియేటర్ యాజమాన్యం డోర్ తెరవడంతో ఆడియన్స్ కి కాస్త ఊపిరి పీల్చుకున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత పరిస్థితి చక్కబడడంతో సినిమా మళ్లీ మొదలైంది.


Also Read: అల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు... 'పుష్ప 2'కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?



కానీ థియేటర్ యాజమాన్యం అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. థియేటర్లో అసలు ఏమైందో విచారణ జరిపి తెలుసుకోవడానికి ప్రయత్నించారట. అనంతరం ముంబై పోలీసులు బాంద్రాలోని గెలాక్సీ థియేటర్లో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు డిసెంబర్ 4న అల్లు అర్జున్ 'పుష్ప 2' ది రూల్ సినిమా ప్రీమియర్ షోలో జరిగిన హృదయ విదారకర సంఘటన అందరి మనసులను కలచి వేస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులతో కలిసి సినిమా చూడడానికి థియేటర్ కి చేరుకోవడంతో, బన్నీని చూడడానికి జనాలు ఎగబడ్డారు. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళతో పాటు ఆమె కొడుకు కూడా చనిపోయారు.


దీంతో బాధితురాలి కుటుంబ సభ్యుల కంప్లైంట్ మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సెక్షన్ 105,118(1) ఆర్/డబ్ల్యూ 3(5) బీఎన్‌ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ షాకింగ్ ఘటన కారణంగా తెలంగాణలో బెనిఫిట్ షోలను రద్దు చేసింది ప్రభుత్వం. అలాగే టికెట్ ధరల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి 'పుష్ప 2' కోసం దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. ఫలితం కూడా ఆశించిన విధంగానే ఉంది. కానీ వరుసగా 'పుష్ప 2' థియేటర్లలో ఇలాంటి సంఘటలు చోటు చేసుకోవడమే ఆందోళకరంగా మారింది. 


 


Also Read:Pushpa 1 Day Collection: కలెక్షన్ల జాతర... మొదటి రోజే 'ఆర్ఆర్ఆర్' రికార్డుల పాతర - ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ 'పుష్ప 2', ఎన్ని కోట్లో తెలుసా?



Read Also : Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు