Naga Chaitanya Blushes Watching Scene With Samantha: హీరో నాగ చైత‌న్య‌, స‌మంత ఇద్ద‌రు విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం వాళ్లిద్ద‌రు విడివిడిగా ఉంటున్నారు. కానీ, వాళ్లు ఒక‌ప్పుడు క‌లిసి తీసిన సినిమాలు మాత్రం ఎవ‌ర్ గ్రీన్. స‌మంత, నాగ చైత‌న్య ఇద్ద‌రిది హిట్ పెయిర్. ఇద్ద‌రు కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమాలు హిట్. వాటిల్లో ఒక సినిమానే 'మ‌నం'. అయితే, ఇటీవ‌ల ఆ సినిమా రీ రిలీజ్ అయ్యింది. ఆ సినిమా చూసేందుకు నాగ చైత‌న్య కూడా థియేటర్ వెళ్ల‌గా అక్క‌డ ఒక ఆస‌క్తిక‌ర విష‌యం జ‌రిగింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అదేంటంటే? 


సిగ్గుపడ్డ నాగ చైత‌న్య‌.. 


'మ‌నం' సినిమా రీ రిలీజ్ కి వెళ్లారు నాగ చైత‌న్య‌. థియేట‌ర్ లో ప్రేక్ష‌కుల‌తో కలిసి సినిమా చూశారు. అయితే, ఆ టైంలో స‌మంత‌, త‌ను క‌లిసి చేసిన సీన్లు వ‌చ్చిన‌ప్పుడు అంద‌రూ నాగ చైత‌న్య వైపు చూస్తూ కేక‌లు వేసి గోల చేశారు. ఆ టైంలో నాగ చైత‌న్య  క‌నిపించారు. ఇక ఆ త‌ర్వాత ఫ్యాన్స్ అంద‌రూ ఒక్క‌సారిగా అర‌వ‌డంతో ఆయ‌న వాళ్ల‌ను కామ్ డౌన్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఇది మొత్తం వీడియో తీసిన కొంత‌మంది ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌డంతో ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైర‌ల్ గా మారింది. 






2017లో పెళ్లి.. 2021లో విడాకులు.. 


ఇండస్ట్రీలోని హిట్ పెయిర్స్ లో ఒక‌రు స‌మంత, నాగ చైత‌న్య‌. 'ఏ మాయ చేశావే' సినిమాలో ఇద్ద‌రు క‌లిసి న‌టించారు. అయితే, ఆ సినిమా టైంలోనే వాళ్ల మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఆ త‌ర్వాత కొన్నేళ్లు ఇద్ద‌రు రిలేష‌న్ షిప్ లో ఉండి.. 2017లో పెద్దల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే, ఏమైందో తెలియ‌దు కానీ.. ఇద్ద‌రు 2021లో విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌మ‌కు ప్రైవ‌సీ కావాల‌ని, మ్యుచువ‌ల్ గా నిర్ణ‌యం తీసుకున్నామంటూ సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.


ఇక ఇదే విష‌యంపై నాగ చైత‌న్య గ‌తంలో మాట్లాడుతూ.. “నేను దాని గురించి అస‌లు బాధ‌ప‌డ‌టం లేదు. నా స‌న్నిహితులకు నిజం తెలుస్తుంది. నా వ్య‌క్తిగ‌త జీవితంలో ఏం జ‌రుగుతుంది అనే దానికంటే.. న‌టుడిగా నాకు గుర్తింపు రావాల‌ని అనుకుంటున్నాను. కాబ‌ట్టి నేను నా సినీకెరీర్ పై దృష్టి పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాను. సినిమా గురించి మాట్లాడాల‌ని అనుకుంటున్నాను.. నా సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తే చాలా. వారు న‌న్ను న‌టుడిగా గుర్తుంచుకోవాలి అనుకుంటున్నాను” అని విడాకుల గురించి ఒక నేష‌న‌ల్ ఛానెల్ కి చెప్పారు చై. ఇక ఇప్పుడు రీ రిలీజ్ లో త‌ను, స‌మంత క‌లిసి ఉన్న సీన్లు చూసి చై అలా రియాక్ట్ అవ్వ‌డంతో.. ఫ్యాన్స్ అంతా తెగ కామెంట్లు పెడుతున్నారు. 


ఇక సినిమాల విష‌యానికొస్తే.. ప్ర‌స్తుతం నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి క‌లిసి తండేల్ సినిమాలో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆ సినిమా ప్రేక్ష‌కులు ముందుకు రానుంది. నాగ‌చైత‌న్య న‌టించిన ధూత వెబ్ సిరీస్ ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. 


Also Read: ఇళయరాజ నోటీసుల‌పై స్పందించిన 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాత