Saif Ali Khan Son's Debut Movie Nadaaniyan OTT Release Date On Netflix: బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) హీరోగా రూపొందిన ఫస్ట్ మూవీ 'నాదానియన్' (Nadaaniyan). శౌనా గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అందాల నటి శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ (Kushi Kapoor) హీరోయిన్‌గా నటించారు. కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో సాగే డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ మూవీ రూపొందించినట్లు ప్రచారం చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలోకే రిలీజ్ కానుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'నెట్ ఫ్లిక్స్' (Netflix) వివరాలు ప్రకటిస్తూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ఓ క్లాస్ రూమ్‌కు సంబంధించిన సీన్‌ను వీడియోలో చూపించారు. రోటీన్‌కు భిన్నంగా ప్రేమంటే ఏంటి..? అని లెక్చరర్ అడిగితే.. హీరో తనదైన శైలిలో వివరిస్తాడు. ఈ హిందీ మూవీ ఏయే భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందనేది మాత్రం నెట్ ఫ్లిక్స్ వెల్లడించలేదు.
Nadaaniyan OTT Release Date: స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడి ఫస్ట్ మూవీ - ఆ ఓటీటీలోకి డైరెక్ట్‌గా స్ట్రీమింగ్, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Ganesh Guptha
Updated at:
20 Feb 2025 10:13 PM (IST)
Nadaaniyan OTT Platform: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడి ఫస్ట్ మూవీ 'నాదానియన్' నేరుగా ఓటీటీలోకే రిలీజ్ కానుంది. ఈ మేరకు 'నెట్ ఫ్లిక్స్' ఓటీటీ ఓ ప్రత్యేకమైన వీడియోను రిలీజ్ చేసింది.

నేరుగా ఓటీటీలోకే నాదానియన్