Naa Autograph Sweet Memories Re Release Date 2025: తెలుగు ప్రేక్షకులలో రవితేజ (Ravi Teja)కు మాస్ ఇమేజ్ ఉంది. అభిమానులతో పాటు సామాన్యులు సైతం ఆయనను మాస్ మహారాజా అంటారు. అలాగని ఆయన కేవలం మాస్ సినిమాలు మాత్రమే చేయలేదు, క్లాస్ సినిమాలు సైతం కొన్ని చేశారు. అందులో 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్' ఒకటి. ఇప్పుడు ఆ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది.
శివరాత్రి సందర్భంగా 'నా ఆటోగ్రాఫ్' రీ రిలీజ్!రవితేజ కథానాయకుడిగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా 'నా ఆటోగ్రాఫ్'. స్వీట్ మెమరీస్... అనేది ఉప శీర్షిక. సుమారు 20 ఏళ్ల క్రితం... ఆగస్టు 11, 2024లో థియేటర్లలోకి సినిమా వచ్చింది. బాక్సాఫీస్ రిజల్ట్ పక్కన పెడితే... ఈ సినిమా చాలా మంది మనసు దోచుకుంది. కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది.
'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్' సినిమాను శివరాత్రి కానుకగా ఈ నెల (ఫిబ్రవరి) 22న రీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇందులో రవితేజ సరసన గోపిక, భూమిక చావ్లా, మల్లిక నటించగా... ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర చేశారు. బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇందులో పాటలు ఇప్పటికీ వినపడుతూ ఉంటాయి. మలయాళం చేరన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించి ప్రొడ్యూస్ చేసిన సినిమా 'ఆటోగ్రాఫ్'కు తెలుగు రీమేక్ 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్'.
ఇప్పుడు రవితేజ చేస్తున్న సినిమాలు ఏమిటి?Ravi Teja Upcoming Movies: ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో 'మాస్ జాతర' ఒకటి. ఇందులో ఆయన సరసన శ్రీ లీల కథానాయికగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకుడు. వేసవి సందర్భంగా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నహాలు చేస్తున్నారు. దీని తర్వాత మరొక సినిమా కూడా ఓకే చేశారు. ఆ సినిమా వివరాలు తెలుసుకోవడం కోసం కింద లింక్ క్లిక్ చేయండి. 'మాస్ జాతర' తర్వాత మరో ఇద్దరు దర్శకులతో ఆయన సినిమాలు చేయనున్నారు.
Also Read: మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?