మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సంక్రాంతి పండక్కి విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు'తో మెగాస్టార్ చిరంజీవి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ సినిమా కంటే ముందు... గత ఏడాది 'ఓజీ: దే కాల్ హిమ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్'తో పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ భారీ హిట్ కొట్టారు. ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. పవన్ కళ్యాణ్, చిరంజీవి తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా థియేటర్లలోకి వస్తుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఒక చిన్న ఛేంజ్! చరణ్ బదులు పవన్ వస్తున్నారు. హరీష్ శంకర్ సినిమాతో థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నారు. ఆ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 

మార్చి 26న థియేటర్లలోకి 'ఉస్తాద్'మార్చి 27న 'పెద్ది' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేశారు. అయితే, ప్రస్తుతం అది వీలు పడటం లేదు. చిత్రీకరణ కాస్త చేయాల్సి ఉన్నప్పటికీ... ట్విన్స్ జన్మించడంతో పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం కోసం రామ్ చరణ్ కొంత విరామం తీసుకోవాలని అనుకుంటున్నారు. అందువల్ల, మార్చి నెలాఖరుకు 'పెద్ది' పూర్తి అయ్యే అవకాశాలు లేవు. దాంతో ఆ తేదీ కంటే ఒక్క రోజు ముందు 'ఉస్తాద్ భగత్ సింగ్'ను తీసుకు వస్తున్నారు. 

Also ReadMSVPG OTT: ఓటీటీ రిలీజులోనూ 'మెగా' రికార్డ్... రీజనల్ హిట్‌కు ఈ రేంజ్ స్ట్రీమింగ్ ఏంటి బాసూ?

'గబ్బర్ సింగ్' వంటి కల్ట్ హిట్ తర్వాత తన అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh Release Date 2026). మార్చి 26న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకు రానున్నారు. రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. అది అనౌన్స్ చేయడం ఒక్కటే లేట్. అదీ సంగతి. 

Also ReadDil Raju Vs Naga Vamsi: 'దిల్' రాజుకు నాగవంశీ షాక్... Funky Movieతో ఆ బంధం తెగినట్టేనా?

'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆల్రెడీ విడుదలైన 'దేఖ్ లేంగే సాలా' చార్ట్ బస్టర్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న చిత్రమిది.

Also ReadDhurandhar 2: ధురంధర్ 2 లోకేషన్ మేనేజర్‌పై ఎఫ్ఐఆర్... పోలీస్‌ కేసు వెనుక అసలు కారణం ఏమిటంటే?