'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu Movie OTT Release)తో మరో రికార్డ్ క్రియేట్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రెడీ అయ్యారు. బాక్స్ ఆఫీస్ బరిలో ఆల్మోస్ట్ 400 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా... ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా రీజనల్ సినిమాల్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. త్వరలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఆ విషయంలో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. 

ఏడు భాషల్లో వరప్రసాద్ గారు స్ట్రీమింగ్!పాన్ ఇండియా సినిమాలు ఐదు భాషల్లో విడుదల అవుతున్నాయి. హిందీతో పాటు దక్షిణాది భాషలు అయినటువంటి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్ చేయడం కామన్. ఎక్కువ శాతం సినిమాలు ఓటీటీల్లోకి వచ్చినప్పుడు కూడా ఈ ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతాయి. బట్, ఫర్ ఏ ఛేంజ్... 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాను ఏడు భాషల్లో స్ట్రీమింగ్ చేశారు.

Also ReadDil Raju Vs Naga Vamsi: 'దిల్' రాజుకు నాగవంశీ షాక్... Funky Movieతో ఆ బంధం తెగినట్టేనా?

థియేటర్లలో తెలుగులో విడుదలైన 'మన శంకర వర ప్రసాద్ గారు'ను హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ చేయనున్నారు. రీజనల్ సినిమాను ఏడు భాషల్లో స్ట్రీమింగ్ చేయడం బహుశా ఇదే మొదటిసారి అనుకోవాలి.

Also Read: Dhurandhar 2: ధురంధర్ 2 లోకేషన్ మేనేజర్‌పై ఎఫ్ఐఆర్... పోలీస్‌ కేసు వెనుక అసలు కారణం ఏమిటంటే?

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'మన శంకర వర ప్రసాద్ గారు'లో చిరు సరసన నయనతార కథానాయికగా నటించారు. విక్టరీ వెంకటేష్ ప్రత్యేక అతిథి పాత్ర పోషించారు. కేథరిన్, మురళీధర్ గౌడ్, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం తదితరులు కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్ అధినేత సాహూ గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత్రి - చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు.

Also ReadDhurandhar 2 OTT Release: నెట్‌ఫ్లిక్స్‌కు 'ధురంధర్ 2' షాక్... మరో ఓటీటీకి రణవీర్ సింగ్ సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌... ఇప్పుడు 'ధురంధర్: ది రివేంజ్' ను ఎందులో చూడాలంటే?